Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

సెరెనా శుభారంభం

tenniesలండన్ : వింబుల్డన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ సెరెనా విలియమ్స్ శుభారంభం చేసింది. క్వాలిఫయిర్ అమ్రాసడికోవిక్(స్విట్జర్లాండ్)తో జరిగిన తొలిరౌండ్‌లో 34 ఏళ్ల సెరెనా 6-2, 6-4తో సునాయాసంగా విజయం సాధించింది. మ్యాచ్‌లో సెరెనా ఏకంగా 63 విన్నర్స్ కొట్టడం విశేషం. ఇతర మ్యాచ్‌ల్లో ఎలినా వెస్నినా(రష్యా) 7-5, 6-2 పస్కెజ్(ఆస్ట్రియా)పై నెగ్గగా, టిమియాబాబోస్(హాంగేరి) 6-2, 6-3తో స్వాన్ (బ్రిటన్)పై, డోమినికా సిబుల్‌కోవా(స్లోవేకియా) 7-5, 6-3తో లుసిస్‌బ రోని(క్రొయేసియా)పై, రాబర్ట్‌వినీ(ఇటలీ) 6-2, 5-7, 6-3తో రిస్కె(అమెరికా)పై, గ్రాసియా(ఫ్రాన్స్) 6-2, 6-3తో బుయుకకే(టర్కీ)పై గెలిచారు. ఇక పురుషుల సింగిల్స్‌లో రెండోసీడ్ ఆండీముర్రే 6-2, 6-3, 6-4తో బ్రోడీ(బ్రిటన్)పై విజయం సాధించగా, నాల్గోసీడ్ వావ్రింకా 7-6(7/4), 6-1, 6-7(2/7), 6-4తో ప్రిట్జ్ (అమెరికా)పై పోరాడి గెలిచాడు. ఇతర మ్యాచ్‌ల్లో లోఫెజ్(స్పెయిన్), సౌజా (పోర్చ్‌గల్), రోమోస్(స్పెయిన్), నిక్ కిర్గిస్(ఆస్ట్రేలియా), గాస్కెల్(ఫ్రాన్స్), సోంగా (ఫ్రాన్స్) తమ ప్రత్యర్థులను మట్టికరిపించి రెండోరౌండ్‌కు చేరుకున్నారు.

Comments

comments