Home తాజా వార్తలు ప్రియుడిని పెళ్లాడనున్న సెరెనా విలియమ్స్

ప్రియుడిని పెళ్లాడనున్న సెరెనా విలియమ్స్

setena
సిన్సినాటి: ఏడు వింబుల్డన్ టైటిల్స్ విజేత, అమెరికా అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ పెళ్లికూతురు కానుంది. గురువారం సెరెనా.. తన ప్రియుడు, రెడిట్ సహవ్యవస్థాపకుడు అలెక్సిస్ ఒహనియన్‌ను పెళ్లాడనుంది. అతి కొద్దిమంది అతిథుల మధ్య వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. వీరు 2015 నుంచి సహజీవనం సాగిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో తాను గర్భావతినని ప్రకటించిన సెరెనా సెప్టెంబరు 1న పండండి బిడ్డకు జన్మనిచ్చింది. వీరి పెళ్లికి ఏకంగా ఒక మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.6 కోట్లు) ఖర్చు పెట్టనున్నట్లు సమాచారం. అయితే ఈ పెళ్లికి వచ్చేవారు సెల్‌ఫోన్లు తీసుకువెళ్లకూడదంట. ఎందుకంటే సెరెనా తన పెళ్లికి సంబంధించిన హక్కులను స్నేహితురాలు, బ్రిటిష్ జర్నలిస్టు అన్నావింటుర్‌తో కొంత మొత్తానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తుంది.