Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

సెరెనాకు ప్లిస్కోవా షాక్

*సెమీస్‌లో ఓడిన అమెరికా నల్లకలువ

* ఫైనల్‌కు కెర్బర్

యుఎస్ ఓపెన్‌లో టైటిల్ ఫెవరేట్‌గా బరిలోకి దిగిన సెరెనా విలియమ్స్‌కు ఊహించని షాక్.. అసలేమాత్రం అంచనాల్లేకుండా టోర్నీలో అడుగు పెట్టిన చెక్ సుందరి కరోలినా ప్లిస్కోవా అమెరికా తారను వరుస సెట్లలో మట్టికరిపించింది. ప్లిస్కోవా దెబ్బకు సెరెనా నెం.1 కూడా గల్లంతైంది. మరోవైపు జర్మనీ భామ ఎంజిలికె కెర్బర్ అదిరిపోయే ఆటతో వొజ్నియాకిని చిత్తుచేసి టైటిల్ పోరుకు చేరడమే కాదు అగ్రస్థానాన్నీ అందుకుంది.

tennisన్యూయార్క్ : ఏడాది క్రితం యుఎస్ ఓపెన్‌లో సెరెనాకు ఎదురైన పరాభవమే ఈసారీ పునరావృతమైంది. భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి జరిగిన మహిళల సెమీస్‌లో సెరెనాను పదోసీడ్ కరోలినా ప్లిస్కోవా చిత్తుచేసింది. గంటా 29 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో సెరెనా 2-6, 6-7(5/7)తో ఓటమిచవిచూసింది. సెరెనాను మోకాలి గాయం ఇబ్బందిపెట్టడం కూడా మ్యాచ్‌పై ప్రభావం చూపింది. గాయం కారణంగా ఫోర్‌హ్యాండ్ షాట్లు ఆడడంతో సెరెనా తీవ్రంగా ఇబ్బంది పడింది. మ్యాచ్‌లో 12 ఏస్‌లే సంధించిన ఆమె 31 అనవసర తప్పిదాలు చేసింది. గతేడాది సెమీస్‌లో కూడా సెరెనా అనామక క్రీడాకారిణి ఫ్లావియా పెన్నెట్టా(ఇంటలీ) చేతిలోనే ఓడింది. గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో ఫైనల్‌కు చేరడం ప్లిస్కోవా(చెక్‌రిపబ్లిక్)కు ఇదే తొలిసారి. ఈ ఓటమితో 2013 నుంచి తన నుంచి పక్కకు పోని నెం.1 ర్యాంక్ సెరెనాకు దూరమైంది. మరో మూడు రోజులు(ఆదివారం వరకు) సెరెనా నెం.1 ర్యాంక్‌లో కొనసాగింటే వరుసగా అత్యధిక వారాలు అగ్రస్థానంలో కొనసాగిన స్టెఫీగ్రాఫ్ రికార్డును బ్రేక్ చేసేది. సెరెనా వరుసగా 186 వారాలు నెం.1 ర్యాంక్‌లో కొనసాగింది. స్టెఫీగ్రాఫ్ కూడా వరుసగా 186 వారాలపాటు ఈ స్థానంలో నిలిచింది. ఫైనల్లో ప్లిస్కోవా.. రెండోసీడ్ కెర్బర్(జర్మనీ)తో పోటీపడనుంది. సెమీస్‌లో కెర్బర్ 6-4, 6-3తో కరోలినా వొజ్నియా(డెన్మార్క్)పై సునాయాసంగా గెలిచింది.
ఏకపక్షంగా: మ్యాచ్ ప్రారంభానికి ముందు గ్రాండ్‌స్లామ్‌ల్లో తొలిసారి సెమీస్ ఆడుతున్న ప్లిస్కోవాపై అనుభవాజ్ఞురాలు సెరెనా ఏకపక్ష విజయాన్ని సాధిస్తుందనే భావించారంతా. కానీ.. తొలిసెట్‌లోనే మ్యాచ్‌పై అభిమానుల అంచనా తప్పని తన ఆటతోనే నిరూపించింది ప్లిస్కోవా. తొలిసెట్‌లో మొదటి సర్వ్ చేసిన సెరెనా గేమ్‌ను 40-0తో సొంతం చేసుకుంది. ప్లిస్కోవా కూడా తన తొలిసర్వీస్ కాపాడుకోవడంతో గేమ్‌స్కోరు సమమైంది. అయితే మూడోగేమ్‌లో సెరెనాకు షాకిచ్చింది ప్లిస్కోవా. మొదట గేమ్‌లో 30-0తో నిలిచిన సెరెనా అనవసర తప్పిదం చేయడంతో ప్లిస్కోవా స్కోరును 30-30తో సమంచేసింది. ఆ వెంటనే ఫోర్‌హ్యాండ్ షాట్ సంధించిన ప్లిస్కోవా40-30తో గేమ్ నెగ్గి సెరెనా సర్వ్ బ్రేక్ చేసింది. ఇక తన రెండు సర్వీస్‌లు కాపాడుకొని 4-2తో ఆధిక్యంలో నిలిచిన ప్లిస్కోవా ఏడోగేమ్‌లో సెరెనా సర్వీస్‌ను మరోసారి బ్రేక్ చేసింది. సెరెనా డబుల్ ఫాల్ట్ చేసేలా ఫోర్‌హ్యాండ్ షాట్లకు తోడు డ్రాప్ షాట్లు ఆడిన ప్లిస్కోవా గేమ్‌ను లవ్(40-0)తో సొంతం చేసుకుంది. ఇక సెరెనా తప్పిదంతో ఎనిమిదోగేమ్‌ను 40-15తో నెగ్గి ప్లిస్కోవా తొలిసెట్‌ను 27 నిమిషాల్లోనే ముగిచింది.
పోరాడినా..: తొలిసెట్‌లో ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయిన సెరెనా రెండోసెట్‌లో పోరాడింది. అయితే తొలిసెట్ నెగ్గిన ఉత్సాహంతో ప్లిస్కోవా కూడా మరింత గొప్పగా ఆడింది. ఐదోగేమ్‌లో సెరెనా గేమ్‌ను బ్రేక్ చేసిన ప్లిస్కోవా మళ్లీ ఆమెపై చేయి సాధించేలా కనిపించింది. అయితే మరుసటి గేమ్‌లోనే ప్లిస్కోవా సర్వీస్ బ్రేక్ చేసి గేమ్‌స్కోరు 3-3తో సమం చేసింది సెరెనా. ఇక ఎవరి సర్వీస్ వారు కాపాడుకోవడంతో సెట్ టైబ్రేక్‌కు దారితీసింది. టైబ్రేక్ ఆరంభంలో ప్లిస్కోవా 3-0తో నిలిచినా వరుసగా నాలుగు పాయింట్లు సాధించి 4-3తో ఆధిక్యంలో నిలిచింది. ఈ దశలో డబుల్ ఫాల్ట్ చేసిన సెరెనా తరువాత సర్వ్‌కు పాయింట్ సాధించి 5-4తో ముందంజ వేసింది. అయితే వరుసగా రెండు సర్వ్‌లకు రెండు పాయింట్లు నమెదుచేసిన ప్లిస్కోవా.. సెరెనా సర్వ్‌ను బ్రేక్ చేసి టై బ్రేక్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది.

Comments

comments