Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

నాటి షరపోవా రికార్డు నేడు సెరెనా సొంతం

tennisలాస్‌ఏంజిల్స్: ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో కొద్ది పాటిలో టైటిల్‌ను కోల్పోనప్పటికీ మరో సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది మహిళల సింగిల్స్ టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న క్రీడాకారిణిగా సెరెనా గుర్తింపుపొందింది. గత 11ఏళ్లుగా రష్యన్ టెన్నిస్ స్టార్ షరపోవా అత్యధిక పారితోషికం అందుకుంటున్న రికార్డును సెరెనా బద్దలు కొట్టింది. ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం అందుకున్న క్రీడాకారిణుల జాబితాను ఫోర్బ్ మ్యాగజైన్ విడుదల చేసింది. ఇందులో అమెరికా నల్లకలువ సెరెనా తొలిస్థానంలో నిలిచింది. గత 12 నెలల్లో సెరెనా తీసుకున్న పారితోషికం విలువ అక్షరాల 28.9 మిలియన్ డాలర్లు. అంటే భారత కరెన్సీలో రూ. 190కోట్లకు పైమాటే. గత 11ఏళ్లుగా రష్యన్ స్టార్ షరపోవానే తొలిస్థానంలో నిలవగా, ఈ సారి మాత్రం 21.9 మిలియన్ డాలర్ల పారితోషికంతో రెండో స్థానంలో నిలబడింది.
ఈ ఏడాది మొదట్లో షరపోవా డోపింగ్ వివాదంలో చిక్కుకుంది. నైకీ, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, పోర్షే, ట్యాగ్ హ్యూయర్ వంటి కంపెనీల నుంచి భారీ పారితోషికాలు అందుకున్న షరపోవాకు ఇటీవల అవకాశాలు తగ్గిపోయాయి. 34ఏళ్ల సెరెనా గత దశాబ్ద కాలంగా టెన్నిస్ ప్రపంచంలో రాణిస్తోంది. ఇప్పటివరకు 21 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ దక్కించుకున్న సెరెనా, ఫ్రెంచ్ ఓపెన్‌తో స్టెఫీగ్రాఫ్ రికార్డును సమం చేయాలని ఆశించింది. కానీ ముగురుజ చేతిలో పరాజయం పొందడంతో ఆమె ఆ కల నెరవేరలేదు.

Comments

comments