Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

సెరెనా @308

Serena-Williamsన్యూయార్క్: ఇప్పటికే పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్న అమెరికన్ స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి నల్లకలువ సెరెనా విలియమ్స్ తాజాగా మరో అరుదైన మైలురాయిని సొంతం చేసుకుంది. సోమవారం జరిగిన యుఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ మహిళల సింగిల్స్ ప్రి క్వార్టర్ ఫైనల్లో రష్యా క్రీడాకారిణి యెరోస్లావా స్వెదోపై విజయం సాధించడం ద్వారా అత్యధిక సింగిల్స్ మ్యాచ్‌లు(308) గెలిచిన ఘనతను కైవసం చేసుకుంది. దీంతో గ్రాండ్ స్లామ్ ఓపెన్ ఎరాలో టెన్నిస్ దిగ్గజ ఆటగాడు, రోజర్ ఫెదరర్ పేరిట ఇప్పటివరకూ ఉన్న 307 సింగిల్స్ మ్యాచ్‌ల రికార్డు బద్ధలైంది. ఏకపక్షంగా సాగిన పోరులో సెరెనా 6-2, 6-3 తేడాతో స్వెదోవాపై విజయం సాధించి క్వార్టర్స్ బెర్తును ఖరారు చేసుకుంది. అంతకుముందు గ్రాండ్ స్లామ్ టోర్నీల్లో అత్యధిక మహిళల సింగిల్స్ మ్యాచ్‌లు గెలిచిన మార్టినా నవ్రతిలోవా రికార్డును సెరెనా అధిగమించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది వింబుల్డన్ టైటిల్‌ను సొంతం చేసుకున్న సెరెనా.. 22 గ్రాండ్ స్లామ్‌లు గెలిచి జర్మనీ క్రీడాకారిణి స్టెఫీ గ్రాఫ్ రికార్డును సమం చేసింది. అయితే ఈ ఏడాది యుఎస్ ఓపెన్ గెలిచి స్టెఫీగ్రాఫ్ రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉంది.

Comments

comments