Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

ఆస్ట్రేలియా ఓపెన్‌కు సెరెనా దూరం

Serena-Williams

మెల్‌బోర్న్: అమెరికా దిగ్గజం, డిఫెండింగ్ చాంపియన్ సెరెనా విలియమ్స్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియా ఓపెన్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించింది. చాలా కాలంగా ఆటకు దూరంగా ఉన్న తాను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు ఇంకా అందుకోలేదని, దీంతో తాను మళ్లీ పూర్వ వైభవం సాధించేందుకు కొంత సమయం పడుతుందని సెరెనా పేర్కొంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రతిష్టాత్మకమైన టోర్నీలో పాల్గొని పేలవమైన ప్రదర్శన కనబరిచే బదులు దూరంగా ఉండడమే మంచిదని తెలిపింది. తన కోచ్ కూడా ఇదే సూచించాడని, దీంతో ఆస్ట్రేలియా ఓపెన్‌కు దూరంగా ఉండడమే మంచిదనే నిర్ణయానికి వచ్చినట్టు వివరించింది. కాగా, ఇటీవల జరిగిన అబుదాబి ఓపెన్‌లో పాల్గొన్న సెరెనా తొలి రౌండ్‌లో ఓటమి చవిచూసింది. కాగా, త్వరలోనే తాను అందుకుంటానని, మిగిలిన టోర్నీల్లో బరిలోకి దిగడం ఖాయమని సెరెనా స్పష్టం చేసింది.

Comments

comments