Search
Friday 21 September 2018
  • :
  • :

కాలుష్యకారక పరిశ్రమలపై కఠిన చర్యలు: కెటిఆర్

KTR-Congress

సంగారెడ్డి: టిఎస్ ఐపాస్‌తో తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి కెటిఆర్ తెలిపారు. పాశమైలారం పారిశ్రామికవాడలో మంత్రి కెటిఆర్ పర్యటిస్తున్నారు. పారిశ్రామిక వ్యర్ధ జలాల శుద్ధి కేంద్రానికి మంత్రి కెటిఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పటాన్ చెరువు పరిశ్రమలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందన్నారు. పరిశ్రమలు పర్యావరణం రహితంగా ఉండాలని సిఎం కెసిఆర్ చెప్తుంటారని, గతంలో పరిశ్రమల వల్ల కాలుష్యం బాగా పెరిగిపోయిందని, కాలుష్యకారక పరిశ్రమలపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. కాలుష్య నియంత్రణపై పరిశ్రమల అధినేతలతో తాను స్వయంగా మాట్లాడానని, కొన్ని కాలుష్య కారక పరిశ్రమలను మూసివేశామని వెల్లడించారు. కాలుష్య కార పరిశ్రమలను సిటీ అవతలకు తరలిస్తామని, కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేసిన దగ్గర కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకుంటామని వివరించారు. అవసరమైతే పరిశ్రమలు మూసివేస్తామని, కాలుష్యాన్ని వెదజల్లే కంపెనీలను సహించమని హెచ్చరించారు. 1122 పరిశ్రమలను రెడ్, ఆరెంట్ కేటగిరిగా విభజించామని కెటిఆర్ తెలిపారు.

Comments

comments