Home జగిత్యాల బెల్టు షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు

బెల్టు షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు

జగిత్యాల ఎస్‌పి అనంత్ శర్మ
Dharmapuri-SPధర్మపురి: గ్రామాల్లో బెల్టు షాపులు ని ర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జగిత్యాల జిల్లా ఎస్పీ అనంత్‌శర్మ అన్నారు. ధర్మపురి సర్కిల్ కార్యాలయం లో ఆదివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఎస్‌పి అనంత్ శర్మ మాట్లాడుతూ బ్రాండిషాపులు నిర్ణీత సమయంలో మూసి వేసినప్పటికి బెల్టు షాపుల్లో అర్దరాత్రి వరకు మద్యం అమ్మకాలు జరుగుతున్నాయన్నారు. రాత్రి వేలల్లో మద్యం తాగి వాహనాలు నడపి ప్రమాదాలకు గు రవుతున్నారన్నారు. ప్రమాదాలు అరికట్టడం కోసం ప్రభు త్వం జారిచేసిన ఆదేశాల మెరకు బెల్టు షాపులు నేటి( సో మవారం) నుంచి పూర్తిగా నిషేదిస్తున్నామన్నారు. బెల్టు షాపుల ద్వారా మద్యం అమ్మకాలు జరిపినవారిపై పిడి ఆక్ట్ కింద కేసులు నమోదు చేస్తామన్నారు. ఆలయాల, పా ఠశాలల, హైవేల సమీపంలో మద్యం అమ్మకాలు జరుప కూడదన్నారు. మహిళల సమస్యల పరిష్కరించడానికి గ్రా మాల్లో మహిళ సదస్సులు ఏర్పాటు చేస్తామన్నారు. గ్రా మానికి నోడల్ అధికారులను నియమించి, వారి ద్వారా వేదింపుల గురవుతున్న మహిళలు గుర్తించి ఆత్మహత్యలకు పాల్పడకుండా వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వారికి మనో ధై ర్యాన్ని కల్పిస్తామన్నారు. మహిళలకు ఏ సమస్య వచ్చిన 8332821100కి కాల్ చేసి దైర్యంగా తనకు ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఫిర్యాదు చేసినవారి వివరాలు గోప్యంగా ఉంచి, మహిళల వేదింపులకు గురిచేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
కొత్త జిల్లాలు ఏర్పటైన నుంచి జగిత్యాల జిల్లాలో నేరాల సంఖ్య తగ్గిందన్నారు. జిల్లాలో పోలీస్ స్టేషన్ల భవణ ని ర్మాణాల కోసం రూ.8.5కోట్లు నిధులు మంజూరయ్యాయ న్నారు. జిల్లాలోని బుగ్గరంలో నూతన పోలీస్‌స్టేషన్ భవ ణం నిర్మాణం కోసం రూ. 1.25కోట్లు నిధులు మంజూరు కాగా, బీర్‌పూర్‌కు రూ. 1.25, జగిత్యాలలో డిఎస్పీ కార్యా లయ నిర్మాణానికి రూ. 1కోటి మంజూరయ్యయన్నారు. జగిత్యాలలోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం ఏ ర్పాటుకు 20 ఏకరాల స్థలాన్ని కెటాయించినందుకు గాను జిల్లా కలెక్టర్ శరత్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమా వేశంలో ధర్మపురి సిఐ చెల్పూరి శ్రీనివాస్, ధర్మపురి బు గ్గారం ఎస్‌ఐలు రామకృష్ణగౌడ్, మధుకర్‌లు ఉన్నారు.