Home తాజా వార్తలు మంత్రి జూపల్లి ఇంటిని ముట్టడించిన ఉద్యోగులు

మంత్రి జూపల్లి ఇంటిని ముట్టడించిన ఉద్యోగులు

Jupalli

హైదరాబాద్: గ్రామీణ పేదరిక నిర్మూలన పథకం(సెర్ప్) ఉద్యోగులు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఉదయం మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటిని ముట్టడించారు. నగరంలోని అత్తాపూర్‌లో మంత్రి ఇంటి వద్ద ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ తమకు ఆరోగ్య భద్రత కల్పిస్తామని చెప్పిన విషయాన్ని మంత్రికి గుర్తు చేశారు. రాష్ట్రం సిద్ధించి నాలుగేళ్లు గడుస్తున్న తమను పట్టించుకునే వారే లేరని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల ఆందోళనకు స్పందించిన మంత్రి వెంటనే వారి డిమాండ్‌ను సిఎం దృష్టికి తీసుకెళ్తానని స్పష్టం చేశారు. కాగా, గత నాలుగేళ్లుగా ఇదే మాట చెబుతున్నారని, దీనిపై లిఖితపూర్వక హామీ ఇచ్చేంతవరకు ఇక్కడి నుంచి కదలమంటూ ఉద్యోగులు మంత్రి నివాసం వద్ద బైఠాయించారు. దీంతో మంత్రి ఇంటి వద్ద గందరగోళ వాతావరణం నెలకొంది.

SERP Employees Strike at Minister Jupalli Krishna Rao’s Residence.