Home టెక్ ట్రెండ్స్ సెట్‌టాప్ బాక్సుల గడువు మరో 4వారాలు పెంపు : హైకోర్టు

సెట్‌టాప్ బాక్సుల గడువు మరో 4వారాలు పెంపు : హైకోర్టు

set-up-box-images-done-in-pహైదరాబాద్ : సెట్‌టాప్ బాక్స్‌లను అమర్చేందుకు హైకోర్టు మరో నాలుగు వారాల గడువు ఇచ్చింది. గతంలో ఇచ్చిన సమయం నేటితో ముగియడంతో గడువు పొడిగించాలని ఎంఎస్‌ఒలు హైకోర్టును కోరారు. సాంకేతిక కారణాల వల్ల కేబుల్ డిజిటలైజేషన్ పూర్తి చేయలేకపోయినట్లు వివరించారు. అంగీకరించిన ఉన్నత న్యాయస్థానం మరో నాలుగు వారాల గడువు పెంచింది. సెట్‌టాప్ బాక్స్‌ల తయారీ పూర్తిగా విదేశాలపై ఆధారపడి ఉన్నందున ఉత్పత్తి అందక ఇప్పటి వరకు 20 శాతం కూడా సెట్‌టాప్ బాక్స్‌లను అమర్చకలేక పోయామని ఎంఎస్‌ఒల సంఘం అధ్యక్షుడు సుభాష్‌రెడ్డి చెప్పారు. కోర్టు ఇచ్చిన గడువులోగా వాటిని ఏర్పాటు చేసుకోవాలని ఆపరేటర్లు, వినియోగదారులను కోరారు.