Search
Saturday 17 November 2018
  • :
  • :

క్రికెటర్లకు కళ్లు చెదిరే ప్యాకేజి

vrt

కోహ్లి, రోహిత్‌లకు ఏడు కోట్లు

 ధోని, రహానెలకు రూ.ఐదు కోట్లు

ముంబయి: టీమిండియా క్రికెటర్లపై కాసుల పంట పండింది. సెంట్రల్ కాంట్రాక్ట్‌లో భాగంగా టాప్ గ్రేడ్ క్రికెటర్లకు రికార్డు స్థాయిలో ఏడు కోట్ల రూపాయల భారీ ప్యాకేజిని భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) ప్రకటించింది. మూడు ఫార్మాట్‌లో ఆడే క్రికెటర్లకు ఏ ప్లస్ కేటాగిరిని కేటాయించారు. ఇందులో ఐదుగురు క్రికెటర్లకు చోటు దక్కింది. భారత కెప్టెన్ విరాట్ కోహ్లి, ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, ఫాస్ట్ బౌలర్లు భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రిత్ బుమ్రాలకు ఈ కేటాగిరిలో స్థానం లభించింది. వీరందరికి ఒక్కోక్కరికి ఏడాది ఏడు కోట్ల రూపాయల చొప్పున పారితోషికాన్ని చెల్లిస్తారు. గతంలో ఈ గ్రేడ్‌లో ఉన్న వారికి కేవలం రెండు కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించే వారు. ఈసారి వీరికి ఏకంగా ఏడు కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని చెల్లించేందుకు బోర్డు ముందుకు వచ్చింది. మరోవైపు ఏ గ్రేడ్ కాంట్రాక్టులో చోటు సంపాదించిన క్రికెటర్లకు ఏడాదికి ఐదు కోట్ల రూపాయల చొప్పున చెల్లిస్తారు. ఈ కేటాగిరిలో ఏడుగురు టీమిండియా క్రికెటర్లకు చోటు లభించింది. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనితో పాటు స్టార్ క్రికెటర్లు చటేశ్వర్ పుజారా, మురళీ విజయ్, అజింక్య రహానె, వృద్ధిమాన్ సాహా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌లు ఈ కేటాగిరిలో ఉన్నారు. కాగా, గ్రేడ్‌బిలో భాగంగా కాంట్రాక్ట్ పొందిన ప్రతి క్రికెటర్‌కు రూ.3 కోట్ల చొప్పున చెల్లిస్తారు. మరోవైపు సిగ్రేడ్‌లో చోటు సంపాదించిన ఆటగాళ్లకు కోటి రూపాయల చొప్పున ప్యాకేజిని ఇవ్వనున్నారు. ఇదిలావుండగా తాజా కాంట్రాక్టు విధానంపై బిసిసిఐ పాలక మండలి అధికారి వినోద్ రాయ్ స్పందించారు. కార్పొరేట్ స్థాయిలో పంపకాలు జరిగే జరిగే విధంగా ప్రణాళిక రూపొందించాం. ఈ మేరకు టీమిండియా కెప్టెన్ కోహ్లి, మాజీ సారథి ధోని, ప్రధాన కోచ్ రవిశాస్త్రిలు కూడా కాంట్రాక్టు విషయంపై మాతో చర్చించారు. అందరి సలహాలు, సూచనలు తీసుకున్న తర్వాత ఈ నిర్ణయాన్ని ప్రకటించామని రాయ్ వివరించారు.

Comments

comments