Search
Thursday 15 November 2018
  • :
  • :

ఏడుగురు భారత ఇంజినీర్లు కిడ్నాప్

Seven Indian Engineers Kidnapped in Afghanistan

ఆఫ్ఘనిస్థాన్ : ఆఫ్ఘనిస్థాన్‌లో ఏడుగురు భారత ఇంజినీర్లు కిడ్నాప్ అయ్యారు. ఈ విషయాన్ని ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం ధృవీకరించింది. బగ్లాన్ ప్రావిన్స్‌లో ఉన్న పవర్ ప్లాంట్‌లో పని చేస్తున్న ఈ ఇంజినీర్లను సాయుధులు కిడ్నాప్ చేశారు. వీరిని తాలిబన్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేసినట్టు అనుమానిస్తున్నారు. కిడ్నాపైన భారత ఇంజినీర్లను విడిపించేందుకు తాము అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు ఆ దేశ అధికారులు తెలిపారు. ఇంజినీర్ల కిడ్నాప్ వ్యవహారంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వంతో చర్చలు చేపట్టింది. ఇంజినీర్లను విడిపించేందుకు చర్యలు తీసుకోవాలని ఆ దేశ ప్రభుత్వాన్ని భారత్ కోరింది.

Seven Indian Engineers Kidnapped in Afghanistan

Comments

comments