Home జాతీయ వార్తలు కొండచరియ విరిగిపడి ఏడుగురు మృతి…

కొండచరియ విరిగిపడి ఏడుగురు మృతి…

image

జమ్ము కశ్మీర్:  రెయిసీ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. కొండచరియలు విరిగిపడి ఏడుగురు మృతి చెందారు. మరో 26 మందికి తీవ్ర గాయలయ్యాయి. ఈ సంఘటన శాయిరీబాబా జలపాతం దగ్గర జరిగింది. ఆదివారం 3:30 గంటలకు ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. రెయిసీ జిల్లా కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో ఈ జలపాతం ఉంది. చీనాబ్ నదిపైన 466 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ జలపాతం నార్త్ ఇండియాలో ఆకర్షనీయమైన వాటర్‌ఫాల్‌గా పేరు. పోలీసులు, మిలటరీ అధికారులు బాదితులకు సహాయక చర్యలు చేపట్టారు.