Home జాతీయ వార్తలు ఉత్తరాఖండ్‌లో కుండపోత వర్షాలు: ఏడుగురు మృతి

ఉత్తరాఖండ్‌లో కుండపోత వర్షాలు: ఏడుగురు మృతి

Seven Killed in Uttarakhand Heavy Rains Today

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌లో కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా ఇప్పటి వరకు ఏడుగురు మృతిచెందారు. ఉత్తరాఖండ్‌ రాజధాని డెహ్రాడూన్‌ పరిధిలోని  శాస్త్రి నగర్‌లో ఒక ఇళ్లు కుప్పకూలడంతో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు పొటెత్తుతున్నాయి. దీంతో వరదల ధాటికి మరో ముగ్గురు గల్లంతయ్యారు. కొండచరియలు రహదారులపై విరిగిపడుతున్నాయి. పితోర్‌ఘర్‌లో బ్రిడ్జి కుప్పకూలిపోయింది. భారీగా వరదనీరు రోడ్లపైకి వచ్చి చేరుతుండటంతో రవాణావ్యవస్థకు తీవ్ర అంతరాయం కలుగుతుందని అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. వాన జోరుకు ఇప్పటికే జనజీవనం పూర్తిగా స్తంభించి పోయింది. మరో మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.