Search
Tuesday 20 November 2018
  • :
  • :

ఏడుగురు మావోయిస్టులు మృతి

  • చత్తీస్‌గఢ్ నారాయణపూర్ జిల్లాలో ఎన్‌కౌంటర్

Maoist-Encounterరాయ్‌పూర్ : చత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. నారాయణపూర్ జిల్లాలోని పుష్పల్ గ్రామ సమీపంలో మంగళవారం నాడు భద్రతా బల గాలు, మావోయిస్టులకు నడుమ జరిగిన హోరాహోరీ కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. మరి కొందరు గాయపడ్డట్టు సమాచారం. ఈ మేరకు మావోయస్టు వ్యతిరేక ఆపరేషన్ డిజిపి అవస్థీ మీడియాకు వెల్లడించారు. జిల్లా రిజర్వు గ్రూప్(డిఆర్‌జి), పోలీసులు సంయుక్తంగా నారా యణపూర్, దంతెవాడ జిల్లాల సరిహద్దులో కూబింగ్ నిర్వహిస్తుండగా పుష్పల్ గ్రామ అడవుల్లో మావోయిస్టులు తారసపడ్డారని ఆయన వివరించారు. తొలుత మావోయిస్టులు కాల్పులు ప్రారంభించ డంతో బలగాలు కూడా ఎదురుకాల్పులు మొదలుపెట్టాయని తెలిపారు. పరస్పరం చాలాసేపు కాల్పులు జరిగాయని, రెండు వైపులా శబ్దాలు నిలిచి పోయిన అనంతరం ఆ ప్రాంతాన్నంతా జల్లెడ పట్టామని, ఘటనా స్థలిలో ఏడుగురు నక్సల్స్ మృతదేహాలు కనుగొన్నామని అవస్థీ పేర్కొన్నారు. అదే విధంగా కొన్ని ఆయుధాలు, మందుగుండు సామాగ్రి కూడా స్వాధీనప రుచుకున్నట్టు వెల్లడించారు. భద్రతా బలగాలు బేస్ క్యాంప్‌కు తిరిగి వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు తెలుస్తాయన్నారు.

ఎన్‌కౌంటర్ మృతురాలు గుర్తింపు

చర్ల : చర్ల సరిహద్దుల్లోని ఉడతమల్ల అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో మరణించిన మహిళా మావోయిస్టును వారి బంధువులు గుర్తించటం జరిగింది. ఈమే బీజాపూర్ జిల్లా, ఊసూరు బ్లాక్ పరిధిలోని ఉడతమల్ల గ్రామానికి చెందిన కుంజా అడమి అలియాస్ సోని(26)గా గుర్తించడం జరిగిందని పోలీసులు తెలిపారు.

Comments

comments