Home తాజా వార్తలు రెండు కార్లు ఢీ: ఏడుగురి మృతి

రెండు కార్లు ఢీ: ఏడుగురి మృతి

MBNR--accident

కొత్తకోట: వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కనిమెట్ట వద్ద బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు కార్లు ఢీకొని ఏడుగురు దుర్మరణం చెందగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.