Search
Friday 16 November 2018
  • :
  • :

ఎస్‌సి, ఎస్‌టి ప్రమోషన్లపై ఏడుగురు సభ్యుల ధర్మాసనం

Do not appoint police officer as acting DGP, tells Supreme court States

న్యూఢిల్లీ: ప్రభుత్వోద్యోగాలలో పదోన్నతులలో ఎస్‌సి/ఎస్‌టి కేటగిరిల కోటా లో క్రీమీలేయర్ తీర్పుపై తాత్కాలిక ఆదేశాలు వెలువరించలేమని సుప్రీంకోర్టు బుధవారం స్పష్టం చేసింది. దీనిపై సమీక్ష తమ పరిధిలో లేదని తెలిపింది. 2006 నాటి ఈ తీర్పును నిలిపివేస్తూ తాత్కాలిక ఆదేశాలు వెలువరించాలనే పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. అప్పటి తీర్పును సమీక్షించేందుకు ఏడుగురు సభ్యుల రా జ్యాంగ ధర్మాసనం అవసరం అని న్యాయస్థానం తెలిపింది. ఈ రిజర్వేషన్లపై వివిధ కోర్టు నిర్థారణలు, తీర్పులు ఉన్నందున తీవ్రస్థాయిలో అయోమయం నెలకొందని కేంద్రం తరఫున అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ ధర్మాసనానికి విన్నవించారు. లక్షలాది ఉద్యోగాలపై వీటి ప్రభావం పడుతోందని, వెంటనే ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసి తగు నిర్ణయం తీసుకోవాలని కోరారు.

ఎం నాగరాజ్ ఇతరులు దాఖలు చేసుకున్న పిటిషన్‌లో 2006లో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఇందులో ఎస్‌సి/ఎస్‌టిలకు ప్రమోషన్లలో క్రీమీలేయర్ విధానం వర్తింపచేయరాదని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి అంతకు ముందు కూడా పలు తీర్పులు వెలువడ్డాయి. గత ఏడాది నవంబర్ 15 వ తేదీన దీనికి సంబంధించి అత్యున్నత న్యాయస్థానం రూలింగ్ వెలువరించింది. అంతకు ముందటి తీర్పుపై పునఃపరిశీలన అవసరం ఉందా? లేదా? అనే పరిమిత అంశాన్ని ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారిస్తుందని తెలిపారు. ఇప్పటికే తమ బెంచ్ దీనిపై పలు అంశాలను పరిగణనలోకి తీసుకుందని త్రిసభ్య ధర్మాసనం బుధవారం తెలిపింది. ఏడుగురు సభ్యుల ధర్మాసనం అన్ని విషయాలను పరిశీలిస్తుందని వెల్లడించింది.

Comments

comments