Home తాజా వార్తలు ఎపిలో పడవ ప్రమాదం: ఏడుగురు గల్లంతు

ఎపిలో పడవ ప్రమాదం: ఏడుగురు గల్లంతు

BOAT

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా పోలవరం మండలం పశువుల్లంక వద్ద శనివారం సాయంత్రం గోదావరి నదిపై ఉన్న వంతెన పిల్లర్‌ను పడవ ఢీకొట్టడంతో ఏడుగురు గల్లంతయ్యారు. ఆదివారం ఉదయం వంతెన దిగువ ప్రాంతంలో కోస్ట్‌గార్డ్ సిబ్బంది గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఆరుగురు విద్యార్థినులు, మహిళ ఆచూకీ ఇంకా లభ్యంకాలేదు. గల్లంతైనవారు ప్రియ, మనీషా, సుచిత్ర, అనూష, శ్రీజ, రమ్య, దుర్గగా గుర్తించారు. సమీపంలోనే సముద్రం ఉండటంతో వాళ్ల ఆచూకీపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షం కురుస్తున్న కూడా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పిల్లల ఆచూకీ కోసం రాత్రంతా తల్లిదండ్రులు ఘటనా స్థలంలోనే రోదిస్తున్నారు. సెలవు రోజు ప్రభుత్వ కార్యక్రమానికి హాజరై వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో 23 మంది  సురక్షితంగా బయటపడ్డారు.  ఎపి రాష్ట్రంలో ఎనిమిది నెలల్లో నాలుగు భారీ పడవ ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ప్రతిపక్షనేత జగన్‌మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు.