Home తాజా వార్తలు ఘోర రోడ్డు ప్రమాదం : ఏడుగురు టెకీలు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం : ఏడుగురు టెకీలు మృతి

Road-Accident

పుణె : పుణె-అహ్మద్ నగర్ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు టెకీలు దుర్మరణం చెందారు. ఆదివారం వేర్వేరు ఐటీ సంస్థల్లో పనిచేస్తున్న దాదాపు 13 మంది ఇంజనీర్లు మినీ బస్సులో అహ్మద్‌నగర్‌లో జరిగిన స్నేహితుని వివాహ వేడుకలో పాల్గొని మినీ బస్సులో తిరిగి వస్తున్నారు. ఆ సమయంలో పుణెకి 40 కిలోమీటర్ల దూరంలో వీరి బస్సుని ఎదురుగా వస్తున్న ట్యాంకర్ ఢీకొట్టగా, వెనుక ఉన్న మరో బస్సు కూడా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో వ్యక్తి సోమవారం మృతిచెందారు.