Home జాతీయ వార్తలు సెప్టిక్‌ ట్యాంక్‌లో చిక్కుకున్న ఓ వ్యక్తిని కాపాడబోయి…

సెప్టిక్‌ ట్యాంక్‌లో చిక్కుకున్న ఓ వ్యక్తిని కాపాడబోయి…

Septic Tankగుజరాత్ : సెప్టిక్‌ ట్యాంక్‌లో చిక్కుకున్న ఓ కార్మికుడిని కాపాడబోయి ఆరుగురు వ్యక్తలు మృతి చెందారు. ఈ ఘటన వడోదరలో శనివారం ఉదయం చోటు చేసుకుంది. వడోదరలోని దభోయిలో గల దర్శన్‌ హోటల్‌లో సెప్టిక్‌ ట్యాంక్‌ను శుభ్రం చేసేందుకు హోటల్ యజమాని నలుగురు వ్యక్తులను కూలీకి మాట్లాడుకున్నాడు. ఈ క్రమంలో ముందు ఓ కూలీ ట్యాంక్ ను శుభ్రం చేసేందుకు అందులోకి దిగాడు. అయితే సదరు కార్మికుడు చాలా సేపటి వరకు బయటకు రాకపోవడంతో అతడిని వెలికి తీసేందుకు ముగ్గురు కూలీలు కూడా ట్యాంక్ లోకి దిగారు. వీరు సైతం తిరిగి బయటకురాలేదు. దీంతో హోటల్ లో పని చేసే మరో ముగ్గురు సైతం ట్యాంకులోకి దిగారు. వీరు కూడా తిరిగి బయటకు రాలేదు. దీంతో హోటల్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనాస్థలిని సందర్శించిన పోలీసులు ఎమర్జెన్సీ సిబ్బంది సాయంతో ఏడుగురి మృతదేహాలను ట్యాంక్ నుంచి వెలికి తీశారు. ట్యాంకులో విషవాయువును పీల్చడం వల్లనే వీరు మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. బాధితుల వివరాలు తెలియరాలేదు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి హోటల్ యజమానిని అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.

Seven Suffocate To Death In Hotel’s Septic Tank