Home రంగారెడ్డి హిమాయత్ సాగర్‌లో భారీ చేప

హిమాయత్ సాగర్‌లో భారీ చేప

fish were found in Himayath Sagar
శంషాబాద్ : చేపలు మంచి ఆరోగ్యంతో పాటు కోలస్ట్రాలు సైతం తగ్గిస్తాయి అని వైద్యులు సైతం సలహా ఇస్తుంటారు. నాన్ వేజ్ ప్రియులు అతీగా ఇష్టపడేది చేపలు. నాటు చేపలంటే చాలా ఇష్ట పడుతారు. వాటిని చూడగానే నోరురూంతుంది. అందులో స్ధానికంగా లభించే చేపలను ప్రతి ఒక్కరూ ఇష్టపడుతారు. తెలంగాణ ప్రభుత్వం సైతం చేపల పెంపకానికి పట్టే కుటుంబాలకు సైతం ప్రోత్సహం ఇవ్వడంతో లాభాలు ఆర్జిస్తున్నారు. చేపలు హైదరాబాద్‌కు రాష్ట్రంలోని నాలుమూలలా నుండే కాకుండా ఇతర రాష్ట్రలతో పాటు దేశాల నుండి సైతం వస్తుంటాయి. అంతే కాకుండా ఐస్‌లో పెట్టి ఇక్కడికి రావాణ చేయడం వలన వాటి రుచి తగ్గతుంది. కాని మన ముందే అప్పటికప్పుడు పట్టించిన చేపలకు డిమాండ్ ఎక్కువ. కాని మన మధ్యలో ఉన్న జంట జలాశాయలో ఒక్కటైన హిమాయత్ సాగర్‌లో గురువారం చేపలు పట్టే వారికి దాదాపు ఏడు నుండి ఎనిమిది కిలోల చేప వలలో చిక్కింది. గత రెండేళ్ల నుండి జంట జలాశాయల నుండి నీటి వాడకంను జలమండలి తగ్గించడంతో వేసవిలో సైతం నిండుకుండలా ఉన్న ఈ జలశాయంలో చేపల ఎదుగుదల బాగుండడంతో చేపలు పట్టే వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.