Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

లంచం ఇచ్చే వాళ్లకూ ఏడేళ్ల జైలు

money

 వాణిజ్య సంస్థలపైనా చర్య
 అమలులోకి వచ్చిన కొత్త అవినీతి నిరోధక చట్టం
న్యూఢిల్లీ: కొత్తగా అమలులోకి వచ్చిన అవినీతి నిరోధక చట్ంట కింద లంచం తీసుకునే వాళ్లే కాదు లంచం ఇచ్చే వాళ్లకు కూడా గరిష్ఠంగా ఏడేళ్లదాకా జైలు శిక్ష విధించే అవకాశముంది. ఈ చట్టానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. ప్రభుత్వ ఉద్యోగులే కాకుండా రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లు, బ్యాంకర్లకు ఈ చట్టం ప్రాసిక్యూషన్‌నుంచి రక్షణ కల్పిస్తోంది. వీరిపై దర్యాప్తు జరపడానికి ముందు సిబిఐ లాంటి దర్యాప్తుసంస్థల అధికారులు సంబంధిత అథారిటీనుంచి తప్పనిసరిగా ముందుగా అనుమతి తీసుకోవాలని ఈ చట్టం చెబుతోంది. రాష్ట్రపతి ఈ అవినీతి నిరోధక చట్టం సవరణకు ఆమోదముద్ర వేశారని ఒక అధికార ప్రకటన తెలిపింది.
ఈ చట్టంలోని నిబంధనలు అమలులోకి వచ్చే తేదీని కేంద్ర ప్రభుత్వం 2018 జూలై 26గా నిర్ణయించిందని ఆ ప్రకటన తెలిపింది. ‘ఈ చట్టం కింద ఏ పోలీసు అధికారి కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగి పాల్పడిన నేరంపై లేదా తన అధికార విధుల నిర్వహణలో భాగంగా చేసే సిఫార్సు, లేదా తీసుకునే నిర్ణయంపైనా ముందస్తు అనుమతి లేకుండా దర్యాప్తు, లేదా విచారణ జరపడానికి వీలులేదు’ అని ఆ అధికారిక ఉత్తర్వులో పేర్కొన్నారు. అయితే తనకోసం లేదా వేరే వ్యక్తి కోసం లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నప్పుడు అలాంటి అనుమతి అవసరం లేదని ఈ చట్టం స్పష్టం చేస్తోంది. రిటైరయిన ప్రభుత్వ అధికారులకు కూడా ఈ ‘రక్షణ’ వర్తిస్తుందని చట్టంలో పేర్కొ న్నారు. అవినీతి నిరోధక చట్టానికి చేసిన ఈ సవరణ వల్ల ప్రభుత్వ ఉద్యోగు లు తీసుకునే విశ్వసనీయ చర్యలను అనుమానించి, వారిని వేధించడానికి వీలుండదని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఇటీవల వ్యాఖ్యానిం చడం తెలిసిందే. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇప్పటివరకు ఏ చట్టంలోను లంచం ఇచ్చే వారిని శిక్షించేందుకు అవకాశం లేదు. అయితే ఇప్పుడు వారికి కూడా లంచం తీసుకునే వారితో సమానంగా గరిష్ఠంగా ఏడేళ్లదాకా జైలు శిక్షతో పాటుగా జరిమానా విధించే వీలు కల్పించారు.ఈ చట్ట పరిధిలోకి వాణిజ్య సంస్థను కూడా తీసుకు రావడం మరో విశేషం. వాణిజ్య సంస్థతో సంబంధం ఉన్న వ్యక్తి ప్రభుత్వ నద్యోగికి లంచం ఇ స్తే ఆ సంస్థ తప్పు చేసినట్లు భావిస్తారు. కాగా ఈ కొత్త చట్ట ప్రకారం అవినీతికి సంబంధించిన కేసులను పరిష్కరించడానికి రెండేళ్ల డెడ్‌లైన్‌ను నిర్ణయించారు.

Comments

comments