Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

అయిననూ.. ఐదూళ్లివ్వండి

temple

భద్రాద్రి రామయ్య తెలంగాణలో.. ఆస్తులు ఆంధ్రాలో
ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో సరిహద్దు గ్రామాల్లో ఉత్కంఠ

రాష్ట్ర విభజనతో  పూర్వపు ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలు ఎపిలో విలీనం కావడం, భద్రాద్రి రామయ్య ఆస్తులకు ముప్పు తెచ్చిపెట్టింది. రామయ్య తెలంగాణలో ఉండగా, ఆస్తులు ఆంధ్రాలోకి వెళ్లాయి. రాష్ట్ర సరిహద్దు ఇంకా సమస్యగానే ఉంది. సాధారణ ఎన్నికలకు ముందే ఆ ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లోని శాసనసభ నియోజక వర్గాలలో కలిపితే రామయ్య ఆస్తులకు ఇబ్బందే. విలీన మండలాలు ఎలా ఉన్నా ఆ ఐదు పంచాయతీలనైనా తిరిగి ఇవ్వాలని తెలంగాణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. 

ఆ గ్రామాలు ఇవే… 

ఎటపాక, పురుషోత్తమపట్నం, గుండాల, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు

ఏనుగు వెంకటేశ్వర రావు/ మన తెలంగాణ:రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన ఏడు మండలాలపై కొంత కాలం ఉద్యమం జరిగిం ది. భద్రాద్రి రామయ్య ఆలయ నిర్వహణతో మిళితమైన ఐదు గ్రామ పంచాయతీలనైనా ఇవ్వాల న్న డిమాండ్‌పై పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. తెలంగాణ నుంచి ఆంధ్రాలో విలీనమైన మండలాలను ఆంధ్రప్రదేశ్‌లోని రంపచోడవరం, పోలవరం నియోజక వర్గాల్లో కలపాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం లేఖ రాసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖను కూడా కోరిం ది. ఆ మండలాల్లో పైన పేర్కొన్న నియోజక వర్గ ఓట ర్ల జాబితాలో చేరితే ఇక ఆశలు వదులుకోవాల్సిందే. ఎటపాక, పురుషోత్తమపట్నం, గుండాల, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు పంచాయతీలనైనా వదిలి వేయాలని తెలంగాణ కోరుతుంది.
ఆ ఐదు ఎందుకంటే: పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌లో నిర్మితమవుతున్నందున ముంపు ప్రాంతం కూడా ఆ రాష్ట్రంలోనే ఉండాలన్న ఉద్దేశంతో చింతూరు, కూనవరం, విఆర్‌పురం, వేలేరుపాడు, కుక్కునూ రు మండలాలను పూర్తిగా భద్రాచ లం పట్టణం మినహా మిగిలిన మండలం, బూర్గంపాడు మండలంలోని సగభాగం ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేశారు. భద్రాచలం పట్టణం చుట్టూ ఉన్న ఏటపాక, పురుషోత్తమపట్నం, పిచ్చుకలపా డు, గుండాల, కన్నాయిగూడెం పంచాయతీలకు ప్రత్యేకత ఉంది. పురుషోత్తమ పట్నంలో భద్రాచలం సీతారామ చంద్రస్వామి ఆలయానికి సంబంధించిన 920 ఎకరాల భూమి ఉంది. రాముని భూములు ఆంధ్రప్రదేశ్‌లో ఉంటే ఎప్పుడైనా ఇబ్బందులు తలెత్తవచ్చునని భక్తుల ఆందోళన. ఏటపాక పంచాయతీలో జఠాయువు మండపం ఉంది. ఇది భద్రాద్రి ఆలయంలో అంతర్బాగమే అందుకే ఏటపాకను తెలంగాణలో కలిపితేనే జఠాయువు మండపం భద్రాద్రి ఆలయానికి అనుసంధానం అవుతుంది. భద్రాచలం నియోజక వర్గంలోని చర్ల, దుమ్ముగూడెం, వెంకటాపురం, వాజేడు వెళ్లాలంటే ఏటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు ద్వా రా వెళ్లాలి. తెలంగాణ నుంచి తెలంగాణలోకి వెళ్లాలంటే ఆంధ్రా గ్రామాలు అడ్డుగా ఉన్నాయి. ఆ ఐదు గ్రామాలు తెలంగాణలో విలీనమైతే ఏజెన్సీ ప్రజల ఇబ్బందులు తొలగడంతో పాటు రామయ్య భక్తుల్లో నెలకొన్న ఆందోళనకు తెరపడుతుంది.
ఏపి లేఖ : ఏపిలో విలీనమైన మండలాలు మొత్తం షెడ్యూల్ ఏరియాలో ఉన్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని భద్రాచలం నియోజక వర్గంలోని విలీన ప్రాంతాన్ని రంపచోడవరం నియోజక వర్గంలోనూ అశ్వారావుపేట, పినపాక నియోజక వర్గాలోని విలీన మండలాలను పోలవరం నియోజక వర్గంలోనూ కలపాలని ఏపి ప్రభుత్వం లేఖ రాసింది.దీనిపై కేంద్ర హోం శాఖ, కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ సమయంలో ఆ ఐదు గ్రామాలకు సంబంధించి మినహాయింపు కోరాలనేది ఈ ప్రాంత ప్రజల, శ్రీరాముని భక్తుల కోరిక. తెలంగాణ రాష్ట్రప్రభుత్వం గతంలో పలుమార్లు ఈ విలీన గ్రామాలపై స్పందించింది. ముఖ్యమంత్రి కెసిఆర్ భద్రాచలం పర్యటన సందర్బంలోనూ విలీన మండలాలలోని కొం త ప్రాంతాన్ని తిరిగి తెలంగాణలో కలిపే విషయాన్ని ప్రస్తావించారు. ఏపి ప్రభుత్వం లేఖ రాసిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా స్పందిస్తే ఆ ఐదు గ్రామాలు తిరిగి తెలంగాణ రాష్ట్రంలోకి రావడంతో పాటు భవిష్యత్తులో ఏం జరుగుతుందోనన్న శ్రీ సీతారామ చంద్ర మూర్తి భక్తుల వేదనకు తెరపడుతుంది.

Comments

comments