భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని బూర్గంపాడు మండలం రెడ్డిపాలెం వద్ద శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఆర్ టిసి బస్సు అదుపుతప్పి వంతెన పైనుంచి కింద పడిపోయింది. దీంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు చికిత్స నిమిత్తం వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాద సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.