Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

తీవ్ర హెచ్చుతగ్గులు.. స్వల్ప నష్టాలు

sensex

ముంబై: స్టాక్‌మార్కెట్ వరుస లాభాలకు గురువారం బ్రేకులు పడ్డాయి. సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 73 పాయింట్ల నష్టపోయి 35,246 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 25 పాయింట్లు నష్టపోయి 10,716 వద్ద స్థిరపడ్డాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 35203 నుంచి- 35500 పాయింట్ల మధ్య శ్రేణిలో కదలాడింది. కీలకమైన బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ 23 పాయింట్లు నష్టపోయి 26,131కు చేరింది. మార్కెట్లో అన్ని రంగాలకు చెందిన సూచీలు నష్టాల్లో ముగిశాయి. అయితే అత్యధికంగా నిఫ్టీ రియల్టీ ఇండెక్స్ 2 శాతం నష్టంపోయింది. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలతో తొలుత జోష్‌తో ప్రారంభమైన దేశీ మార్కెట్లు చివరికి నష్టాలతో ముగిశాయి. రోజులో అత్యధిక భాగం స్వల్ప హెచ్చుతగ్గులకు గురయ్యాయి. ఎన్‌ఎస్‌ఇలో రియల్టీ, ఫార్మా, పిఎస్‌యు బ్యాంక్, మెటల్ రంగాలు 2 నుంచి -1 శాతం మధ్య తిరోగమించాయి. నిఫ్టీ దిగ్గజాలలో డాక్టర్ రెడ్డీస్, ఐబి హౌసింగ్, టాటా మోటార్స్, బజాజ్ ఫిన్, సిప్లా, సన్ ఫార్మా, బజాజ్ ఆటో, పవర్‌గ్రిడ్, ఇన్ఫ్రాటెల్, టాటా స్టీల్ నష్టాలను చవిచూశాయి. అయితే ఒఎన్‌జిసి, ఎయిర్‌టెల్, టెక మహీంద్రా, బిపిసిఎల్, ఐషర్, హిందాల్కో, కోల్ ఇండియా, అల్ట్రాటెక్, హెచ్‌పిసిఎల్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి. బిఎస్‌ఇలో మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు 1.5 శాతం మేరకు నష్టపోయాయి. ట్రేడైన మొత్తం షేర్లలో 1885 నష్టపోగా.. 781 షేర్లు మాత్రమే లాభాలను నమోదు చేశాయి.  నగదు విభాగంలో బుధవారం విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్‌పిఐలు) రూ.704 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ ఫండ్స్(డిఐఐలు) రూ.665 కోట్లు ఇన్వెస్ట్ చేశాయి.

Comments

comments