Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

దినేష్ అనే వీడు… నీచుడు

Sex Psycho Arrested by Police in Tamilnadu

చెన్నై: తమిళనాడులో సెక్స్ సైకోను పోలీసులు అరెస్టు చేశారు. రామనాథపురం జిల్లాకు చెందిన దినేష్ కుమార్ అకృత్యాలు వెలుగులోకి వచ్చిన తరువాత పోలీసులు షాక్ గురయ్యారు. ఈ నీచుడు తోబుట్టువులను కూడా వదలలేదు. ట్రాక్ వ్యూ యాప్‌తో మహిళల వ్యక్తిగత వివరాలు సేకరించేవాడు. 80 మంది మహిళలను బ్లాక్ మెయిల్ చేసి పలువురిపై అత్యాచారం చేశాడు. సోదరి వరుసయ్యే మహిళ ఫిర్యాదుతో వీడి దుర్మార్గపు పనులు వెలుగులోకి వచ్చాయి. సైకో ఇంట్లో పోలీసులు సోదాలు జరిపారు. నిందితుడి వద్ద నుంచి మహిళల దుస్తులు, రెండు ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు దినేశ్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎంసిఎ చదువుకొని టెక్నాలజీపై మంచి పట్టు సాధించి అకృత్యాలకు పాల్పడ్డాడు. టెక్నాలజీ సాయంతో మహిళల వ్యక్తిగత సామాచారం చోరీ చేశాడు. కాల్ చేసుకోవాలంటూ ఫోన్ తీసుకొని సీక్రెట్ యాప్ ఇన్‌స్టాల్ చేసి, ఆపై వ్యక్తిగత వివరాలు తెలుసుకొని బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతూ అత్యాచారం చేసేవాడు.

Comments

comments