Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

చికాగోలో టాలీవుడ్ తారలతో సెక్స్ రాకెట్

భారతీయ దంపతుల అరెస్టు

Chicagoచికాగో: చికాగో నగరం కేంద్రంగా కొందరు టాలీవుడ్ నటీమణులతో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న విషయం బయటపడింది. అక్కడ నివసిస్తున్న భారత్ కి చెందిన భార్యాభర్తలను అరెస్ట్ చేయడంతో ఈ సెక్స్ రాకెట్ వెలుగు చూసింది. టాలీవుడ్‌లో నటించే కొందరు అమ్మాయిలను మభ్యపెట్టి వ్యభిచారం చేయిస్తున్నారని అక్కడి దర్యాప్తు సంస్థ 42 పేజీల క్రిమినల్ ఫిర్యాదుని నమోదు చేసిన సమయంలో ఈ కేసు వివరాలు వెలుగు చూశాయి. చికాగోలోని జిల్లా కోర్టులో దర్యాప్తు సంస్థ దాఖ లు చేసిన ఫిర్యాదులో భారత్‌కి చెందిన భార్యాభర్తలు ఈ నేరానికి పాల్పడ్డారని కోర్టుకి తెలిపింది. నిందితుడిని 34 ఏళ్ల కిషన్ మోదుగుమూడి అలియాస్ రాజు అలియాస్ శ్రీరాజ్ చొన్నుపాటిగా అక్కడి పోలీసులు గుర్తించారు. కిషన్ భారత్‌కి చెందిన ఓ వ్యాపారవేత్త అని, కొన్ని టాలీవుడ్ సినిమాలకు సహ నిర్మాతగా వ్యవహరించాడని దర్యాప్తులో తేలింది. ఆయన భార్య చంద్రని కూడా ఏప్రిల్‌లోనే  పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అప్పటి నుంచి నిందితులు బెయిల్ కోసం ప్రయత్నాలు చేసినా  కోర్టు మంజూరు చేయలేదు. వీరిద్దరిపై ఫిర్యాదుని చికాగో కోర్టు స్వీకరించింది. తాత్కాలిక వీసాపై అమెరికాలో పాల్గొనే కార్యక్రమాలకు హాజరయ్యే టాలీవుడ్ నటీమణులతో వ్యభిచారం చేయిస్తున్నారని  పోలీసులు కోర్టు దృష్టికి తెచ్చారు.

ఈ సెక్స్ రాకెట్ విషయం ప్రధాన బాధితురాలి ఉత్తరం తో వెలుగు చూసింది. ఇక్కడి దర్యాప్తు సంస్థలకు ఆమె తన గోడుని వెళ్లబోసుకుంది. తనకు ఎటువంటి హానిని తలపెట్టవద్దని వేడుకుంది. కొద్దికాలం పాటు టాలీవుడ్‌లో నటించిన ఈ అమ్మాయి అమెరికాలో తెలుగు వారు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనడానికి చికాగో వచ్చిందని దర్యాప్తులో తేలింది. నిందితులైన భార్యాభర్తలపై మోపిన అభియోగాల్లో నలుగురు టాలీవుడ్ అమ్మాయిలను బలవంతంగా ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంచి, విటులు వచ్చే తేదీని వారికి తెలిపేవారని  పోలీసులు పేర్కొన్నారు. ఒక్కో విటుడి నుంచి 3 వేల డాలర్లని వసూ లు చేశారని తెలిపారు. టాలీవుడ్ తారల దగ్గరికి వచ్చే విటులను అరెస్టయిన భార్యాభర్తలు, అమెరికాలో జరిగే తెలుగువారి సమావేశాల్లో, సాంస్కృతిక ప్రదర్శనల్లో ఎంపిక చేసుకునే వారని పోలీసుల అభియోగాల్లో తెలిపారు. నిజానికి టాలీవుడ్‌కి చెందిన బాధితులకు అమెరికాలో మంచి ఉన్నతోద్యోగం ఇస్తామని నిందితులు ఆశపెట్టేవారు. కిషన్ భార్య చంద్ర ఈ సెక్స్ రాకెట్‌కి సంబంధించిన వివరాలను  రహస్యంగా రాసి పెట్టుకుందని, ప్రతి నటికి సం బంధించిన వివరాలు వేరు వేరుగా రాసిందని, ఎంత మొత్తంలో డబ్బులు వసూలు చేశారన్నిది కూడా ఆమె దాచిన రికార్డుల్లో బయటపడిందని దర్యాప్తు అధికారులు తెలిపారు. నిందితుల ఇంటిపై దాడి చేసినప్పుడు 70 కండోమ్స్ ప్యాకెట్లు దొరికాయని చెప్పారు. నిందితులైన జంటకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు.  వారిని వర్జీనియాలోని  శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు.

Comments

comments