Search
Tuesday 20 November 2018
  • :
  • :

బాలికపై లైంగిక దాడి..

girl-rapedకరీంనగర్: బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఓ యువకుడిని స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళితే కరీంనగర్ జిల్లా సారంగాపూర్‌లో పదేళ్ల బాలికపై సమీపంలో నివాసముండే రవి (22)అనే యువకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. అనంతరం యువకుడు బెదిరించడంతో బాలిక విషయం ఎవరికీ చెప్పలేదు. నాలుగురోజులుగా కడుపునొప్పితో బాధపడుతున్న బాలికను తల్లిదండ్రులు డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యురాలు బాలికపై లైంగిక దాడి జరిగిందని నిర్థారించింది. దీంతో తల్లిదండ్రులు జరిగిన విషయాన్ని గ్రామ సర్పంచ్‌కు ఫిర్యాదు చేశారు. గ్రామస్తులు నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. సారంపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునాన్నారు.

Comments

comments