Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

దళిత బాలికపై లైంగిక దాడి

Rape on Girl at Nizamabad

హైదరాబాద్ బిర్లా మందిర్ వద్ద దారుణం 

మన తెలంగాణ/ హైదరాబాద్ / సోమాజిగూడ : ఓ దళిత బాలికపై బిర్లా మందిర్ వద్ద వ్యాపారం నిర్వహిస్తున్న వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బిర్లా మందిర్ వద్ద కూలి పని చేసుకుంటూ దళిత దంపతులు నివాసముంటున్నారు. వీరికి ముగ్గురు అమ్మాయిలు. వీరిలో చిన్న బాలిక (12) పాచి పనులు చేసేది. బిర్లా మందిర్ వద్ద వ్యాపారం నిర్వహిస్తున్న నింది తుడు వై. రమేష్ (50) ఇంట్లో కూడా ఆ బాలిక పని చేసేది. ఇటీవలే రమేష్ ఇంట్లో తన కూతురి పెళ్లి జరిగింది. పెళ్లి అనంతరం ఈ నెల 16న రమేష్ పని ఉందని నమ్మబలికి తన వ్యాపార కార్యాలయానికి బాలికను తీసుకెళ్లాడు. ఆపై బాలికను గాయపరిచి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెపితే చంపేస్తానని బెదిరించడంతో సదరు బాలిక తల్లిదండ్రులకు సైతం చెప్పలేదు. నాలుగైదు రోజుల నుంచి బాలికలో మార్పు కనిపించడంతో తల్లి ఒత్తిడి తెచ్చి ఆరా తీసింది. దీంతో బాలిక విషయాన్ని బయట పెట్టింది. తల్లిదండ్రులు ఈ నెల 26న సైఫాబాద్ పీఎస్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, నిందితున్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.అరెస్టై మూడు రోజులై నా సైఫాబాద్ పోలీసులు ఇప్పటి వరకు రిమాండ్‌కు తరలించలేదు. బాలికను చికిత్సచేసి బాలికల వసతి గృహానికి తరలించారు. పోలీసుల తీరుపై దళిత సంఘాల నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.శుక్రవారం పలు దళిత సంఘాల నాయకులు బాలిక ఇంటి వద్ద విచారణ చేపట్టారు.

Comments

comments