Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

కన్నకూతురిపై లైంగిక దాడి

rapeపాల్‌ఘర్ : సభ్యసమాజం తలదించుకునేలా ఓ కన్న తండ్రి తన కూతురిపై ఐదేళ్లుగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. మూడు సార్లు అబార్షన్ కూడా చేయించాడు. కన్న తండ్రి దాష్టికాన్ని తట్టుకోలేక బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆ మానవమృగాన్ని అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్రలోని పాల్‌ఘర్ జిల్లాలో ఉన్న ఓ గ్రామానికి చెందిన నాటు వైద్యుడు(47) 2011లో తన భార్య చనిపోయిన నాటి నుంచి కన్నకూతురు(20)పై లైంగిక దాడి చేస్తున్నాడు. ఆమె గర్భవతి అయిన మూడు సందర్భాల్లో అబార్షన్ చేయించాడు. లైంగిక దాడిని కొనసాగించడంతో బాధితురాలు ఇటీవల బిడ్డను ప్రసవించింది. అతడి రెండో భార్య ఇటీవలే వదిలేసి వెళ్లిపోయింది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Comments

comments