Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

బాలికపై లైంగిక దాడి

rapeగుంటూరు: మండల కేంద్రమైన బెల్లంకొండ సుగాలీ కాలనీలో ఓ బాలిక(12)పై లైంగిక దాడి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బాధిత బాలికకు దూరపు బంధువైన ఓ వ్యక్తి కొన్ని రోజుల క్రితం ఆమెకు మాయమాటలు చెప్పి రెండు, మూడు సార్లు లైంగిక దాడిక పాల్పడ్డాడు. బాలిక అనారోగ్యంతో బాధపడుతుండడంతో ఆమెను తల్లిదండ్రులు ప్రశ్నించారు. ఈ క్రమంలో తనపై జరిగిన లైంగిక దాడి గురించి కన్నవారికి తెలిపింది. లైంగిక దాడి గురించి ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడని పేర్కొంది. దీంతో బాధిత బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైద్యపరీక్షల నిమిత్తం బాధిత బాలికను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు విచారిస్తున్నారు.

Comments

comments