Search
Tuesday 18 September 2018
  • :
  • :
Latest News

మైనర్ బాలికపై పోలీస్ లైంగిక వేధింపులు..

Police-Station

లక్నో: ఇద్దరు బాలికలు తమని లైంగికంగా వేధిస్తున్నారని ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ ఉన్న కానిస్టేబుల్ ఫిర్యాదు సంగతి పక్కన పెట్టి వాళ్లను లైంగికంగా వేధించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈశ్వర్ ప్రసాద్ అనే కానిస్టేబుల్ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఇద్దరు బాలికలతో అసభ్యంగా ప్రవర్తించాడు. కానిస్టేబుల్ మంచంలో పడుకొని ఒకరి చేయిపట్టుకొని లైంగికంగా వేధించినట్లు సిసి కెమెరాలో రికార్డయింది. ఈ ఘటనపై స్థానిక ఎస్‌పి రాజేష్ మీడియాతో మాట్లాడుతూ… లైంగికంగా వేధించిన కానిస్టేబుల్, నిందితులపై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని తెలిపారు.

Comments

comments