Home సూర్యాపేట బాలికలకు అండగా పోక్సో

బాలికలకు అండగా పోక్సో

 Sexual assaults harassment on Girls In Suryapet

మన తెలంగాణ/దామరచర్ల: ప్రేమ పేరుతో మైనార్టీ తీరని బాలికలను తీసుకెళ్లడం, వారిని లైంగిక వేధింపులకు గురిచేయడం, అనుచితంగా ప్రవర్తించడం, అభత్రాభవం కలిగించడం నేరం. ఇలాంటి వారి ఆట కట్టించేందుకు షీటీమ్స్ వ్యస్థను విజయవంతంగా కొనసా గిస్తూనే ప్రభుత్వం అమ్మాయిల రక్షణకు పోక్సో చట్టాన్ని ఆయుధంగా తీసుకొచ్చింది. చట్టం ఎంత కఠినంగా ఉందో తెలియని యువత బాలల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ కేసుల బారిన పడుతున్నారు. చదువుకుని ఉన్నతంగా ఎదగాల్సిన వయస్సులో జైలు జీవితం గడుపుతున్నారు. 2012లో రూపొందించిన లైంగిక నేరాల నుంచి బాలికల హక్కుల రక్షణ చట్టం(పోక్సో) ప్రకారం 18 ఏళ్లలోపు వయస్సున్న వారంతా బాలలతో సమానమే. పోక్సో చట్టం అమలును జాతీయ, రాష్ట్ర బాలికల హక్కుల రక్షణ కమీషన్ పర్యవేక్షిస్తోంది.
కేసు నమోదైతే భవిష్యత్ నాశనమే..
కొంతమంది యువకులు మైనార్టీ తీరని బాలికలను ప్రేమ పేరుతో వారిని తీసుకెళ్లి వివాహాలు చేసుకొని వస్తున్నారు. తదుపరి తల్లిదండ్రులు తమ కుమార్తెను తీసుకెళ్లినట్లు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తున్నారు. ఈ కేసులో తల్లిదండులిచ్చిన ఫిర్యాదు మాత్రమే పరిగణనలోకి తీసుకుని నిందితులపై కేసులు నమోదు చేసి జైళ్లకు పంపుతున్నారు. దీంతో వారి జీవితం చిన్నాభిన్నమవుతోంది. అదే విధంగా చిన్న వయస్సులో ఇంట్లో నుంచి వెళ్లిపోయి వివాహాలు చేసుకుంటున్న వారిలో ఎక్కవ మంది యువకులు తర్వాత వదిలించుకోవడానికి ప్రయత్నిస్తుండడంతో బాధిత బాలికల పరిస్థితి అగమ్యఘోచరంగా మారుతోంది. ఇటీవల కాలంలో అన్ని పోలీస స్టేషన్లలో యుక్తవయస్సు వచ్చి యువత అదృశ్యాల వెనుక ఇలాంటి ఘటనే ఉంటుంటున్నాయి.
చట్టం ఏమి చెబుతుందంటే..
18 ఏళ్ల లోపు వయస్సున్న వారంతా బాలలతో సమానమని, బాలలపై లైంగిక దాడులు, వేధింపులు, బూతు సాహిత్యం నుంచి రక్షించేందుకు ఈ చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చారు. ఈ చట్టం ప్ర కారం వారిని ఏ రకంగా ఇబ్బందులకు గురిచేసినా, ప్రలోభపెట్టినా, బూతు సాహిత్యం చూపించడాన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తోంది. వారిని మాటలతో బెదిరించి వారిలో అభద్రతా భావం కలిగించినా ఈ చట్టం పరిధిలో కేసు నమోదు చేసేందుకు వెసులుబాలు ఉంది. అకతా యి ఎవరైనా బాలికలను శారీరకంగా, మానసికంగా వేధిస్తే, లైంగికం గా దాడి చేస్తే చట్టం ద్వారా నెలన్నరకు తక్కువ కాకుండా రిమాండ్‌లో ఉంచేందుకు, గరిష్టంగా 7 ఏళ్లు, ఒక్కోసారి తీవ్రతను బట్టి యావజ్జీవ కారాగార శిక్ష, జరిమానా కూడా విధించే అవకావముంది. అంతేకా కుండా ఫిర్యాదు నమోదైన ఏడాదిలో కేసు పూర్తి చేయాలనే నిబంధన ఉంది. సత్వర విచారణతో పాటు పరిశోధన వివరాలు న్యాయస్థానం ఎదుట పెట్టేందుకు వెసులుబాటు ఉంది.
పిల్లల పట్ల తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలి
తల్లిదండ్రులు ఎక్కవమంది పిల్లల ప్రవర్తనపై దృష్టి సారించడంలేదు. రోజులో 2 గంటలైనా వారికి సమయం కేటాయించి వారితో గడపాలి. అమ్మాయిలు ఎవరినైనా ప్రేమిస్తున్నామని వారిని కొట్టడం, కళాశాలలు బంద్ చేయించడం వంటివి చేయవద్దు. ఇలా చేస్తే పిల్లలు విపరీతమైన నిర్ణయాలు తీసుకునే అవకావముంది. పిల్లలకు ఒక వయస్సు వచ్చినప్పటి నుంచి చదువు, జ్ఞానం, ఉత్తమ జీవితం, ఉద్యోగం జీవితానికి ఎంత అవసరమో తెలియపర్చాలి. ఆకర్షణ, ప్రేమ మధ్య తేడాని వివరించాలి. పిల్లలు చదివే కళాశాలలు, పాఠశాలల్లోని ఉపాధ్యాయులు, యాజమాన్యాలతో తరచూ మాట్లాడుతుంటే పిల్లల కదలికలు తెలిసే అవకాశముం ది. వారితో స్నేహం చేసే వారి వివరాలు సైతం తెలుసుకోవాలి. సామాజిక మాధ్యమాల విస్తృత వినియోగం వల్ల పిల్లలు చిన్న వయస్సులోనే ఆకర్షణ వలలో పడుతున్నారు. దీనిపై నియంత్రన ఉండాలి.
బాలికలు, యువతులు గుర్తించాల్సిన అంశాలు..
ఆకర్షణ, ప్రేమ మధ్య తేడా తెలుసు కో వాలి. జీవి తంలో స్థిరపడ కుండా ప్రేమ అవసరమా అనేది ఆలోచిం చాలి. 21 ఏళ్లు నిండనిదే జీవి తానికి సంబ ంధించిన నిర్ణయాలు తీసుకోక పోవడం మంచిది. చిన్న వయ స్సులో ప్రేమలో పడుతున్న చాలామంది యువ తులు మోసపోయి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటనలు ఎక్కవగా ఉన్నాయి. వారితో స్నేహం చేసే యువకుల తీరు, నిజాయితీని యువ తులు గమనిస్తుండాలి. స్నేహితుడిగా ఉంటూనే హద్దుమీరి ప్రవర్తిస్తే మొదట్లోనే తల్లిదండ్రులకు చెప్పి దూరంగా ఉండడం మంచిది. తర్వాత కూడా ఇబ్బంది పెడితే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి.
చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి :శ్రీనివాసు, డీఎస్పీ, మిర్యాలగూడ
తెలిసి, తెలియని వయస్సులో ప్రేమ పేరుతో యువకులతో వెళుతున్నారు. ఆ తర్వాత మోసపో యి వాస్తవాలు గ్రహిస్తున్నారు. మరి కొందరు మైనర్లను పెళ్లి చేసుకుంటున్నారు. ఇది చట్టరీత్యా నేరం. తల్లిదండ్రులు వారి పిల్లల కదలికలపై కన్నేసి బాధ్యతాయుతంగా గమనిస్తుండాలి.
పోక్సో చట్టాలసై అవగాహన కల్పిస్తున్నాం : నగేష్, ఎస్సై,
షీ టీమ్స్, పోక్సో చట్టాలపై విద్యా సంస్థల్లో అవగాహన కార్యక్ర మాలు నిర్వహించి విద్యా ర్థులను చైతన్య పరుస్తు న్నాం. మహిళలను వేధిస్తే విలువైన జీవితాన్ని కోల్పో వా ల్సి వస్తుం దని చెబు తున్నాం. క్షణి కమైన ఆలోచనలు, తాత్కాలికమైన ఆకర్షణలతో బాలికలను ఏ రూపంలో వేధించినా శిక్షార్హులవుతారు.