Home తాజా వార్తలు అన్నిచోట్ల ‘క్యాస్టింగ్ కౌచ్’: రష్మీ

అన్నిచోట్ల ‘క్యాస్టింగ్ కౌచ్’: రష్మీ

anchor-rasmi

హైదరాబాద్: మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులను ”క్యాస్టింగ్ కౌచ్” పేరిట ఫిల్మ్ ఇండస్ట్రీని లక్ష్యంగా చేసుకోవడం తగదని ప్రముఖ యాంకర్ రష్మీ గౌతమ్ తెలిపారు. మహిళలపై లైంగిక వేధింపులు ప్రతి చోటా జరుగుతున్నాయని, కేవలం సినీ పరిశ్రమని టార్గెట్ చేసుకొని ఈ అంశాన్ని మరింత పెద్దదిగా చేయడం సరికాదని ఆమె పేర్కొంది. క్యాస్టింగ్ కౌచ్ ను ఓ అంశంగా చేస్తూ, చౌకబారు సంతోషం పొందడం కన్నా ఈ దారుణాలు జరగకుండా ఆపడానికి తమ వంతు ప్రయత్నం చేద్దామని రష్మీ పిలుపునిచ్చింది. కాగా రష్మీ చేసిన ఈ ట్వీట్ పై నెటిజన్లు భిన్న వ్యాఖ్యలకు తెర లేపారు.