Search
Thursday 15 November 2018
  • :
  • :

హిమదాస్ కోచ్‌పై లైంగిక ఆరోపణలు

Himada-Coash

ఢిల్లీ: హిమదాస్ కోచ్ నిపన్ దాస్ లైంగిక ఆరోపణల్లో చిక్కుకున్నాడు. దాస్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఓ క్రీడాకారిణి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్ర రాజధాని గువాహటిలోని ఇందిరాగాంధీ అథ్లెటిక్స్ స్టేడియంలో ఎంతో మంది అథ్లెట్లకు నిపన్‌దాస్ శిక్షణ ఇస్తున్నాడు. ఎంతో మంది క్రీడాకారులను అతడు తీర్చిదిద్దాడు. తనపై చేస్తున్న ఆరోపణలు కల్పితమైనవని, కావాలని తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆమె కంటే వేగంగా పరుగెత్తే క్రీడాకారులు తన దగ్గర ఉన్నారని వెల్లడించారు. పోలీసులు విచారణలో ఎలాంటి మచ్చ లేకుండా తాను బయటపడతానని ధీమా వ్యక్తం చేశారు. సహాయక కోచ్ లు, మహిళ క్రీడాకారులను పోలీసులు విచారిస్తున్నారు. జులై 12న ఫిన్లాండ్ లో జరిగిన అండర్ 20 వరల్ ఛాంపియన్స్ లో మహిళల 400 మీటర్ల పరుగులో నిపన్ దాస్ శిష్యురాలు హిమదాస్ పతకం సాధించిన విషయం తెలిసిందే.

Comments

comments