Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

సుమన్‌పై లైంగిక వేధింపుల కేసు అవాస్తవం

Balka-Suman

మంచిర్యాల: పెద్దపల్లి ఎంపి బాల్కసుమన్‌పై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లైంగిక వేధింపుల ఘటన అవాస్తవమని స్థానిక సిఐ మహేష్ తెలిపారు. బాధితులుగా చెప్పుకుంటున్న బోయిన సంధ్య, విజితలపై 2018 ఫిబ్రవరి 6న కేసు నమోదు చేశామని వెల్లడించారు. ఎంపిని ట్రాప్ చేసి బ్లాక్ మెయిల్ చేసి లబ్దిపొందాలని చూస్తున్నారని, ఎంపి కుటుంబ సభ్యుల ఫొటోను మార్పింగ్ చేసి ఆన్‌లైన్ సర్క్యూ లేట్ చేశారని పేర్కొన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో వారిపై కేసులు నమోదయ్యాయని వివరించారు. ఇద్దరు నిందితులు సంధ్య, విజితలు పలువురిని బ్లాక్‌మెయిల్ చేసి వేధించినట్టుగా తమ విచారణలో తేలిందని, వీరిపై త్వరలో కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వీరిపై 420, 292ఎ, 419, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని సిఐ తెలిపారు.

Comments

comments