Search
Sunday 23 September 2018
  • :
  • :

ముంబయిలో విదేశి మహిళపై లైంగిక దాడి..

Sexual Harrasment on Foreign woman in Mumbai

ముంబయి:  టూర్‌ గైడ్‌గా చెప్పుకున్న ఓ వ్యక్తి ముంబయిలో   37 సంవత్సరాల ఇటలీ  మహిళపై  లైంగిక దాడికి పాల్పడ్డాడు.   ఈ దారుణానికి పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.  గత నెల 14న ముంబయి నగరాన్ని వీక్షించేందుకు వచ్చిన మహిళ  బస్సులో ప్రయాణిస్తుండగా లైంగిక దాడి జరిగిందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొన్నారు. తాను టూరిస్ట్‌ గైడ్‌నని బాధితురాలికి పరిచయం చేసుకున్న నిందితుడు ఆమెను ట్రావెల్స్‌ బస్సులో నగరంలో దర్శనీయ స్థలాలను చూపేందుకు తీసుకువెళ్లాడని పోలీసులు చెప్పారు. అదే రోజు సాయంత్రం ఏడు గంటలకు జుహులో బస్‌ టూర్‌ ముగిసిన  అనంతరం ఆమెను అక్కడి నుంచి కొలబా హోటల్‌లో దింపేందుకు క్యాబ్‌ను బుక్‌ చేశాడు. మార్గమధ్యంలో ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడని పోలీసులు పేర్కొన్నారు. బాధితురాలు ఇటలీ రాయబార కార్యాలయాన్ని సంప్రదించగా స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని వారు సూచించారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

Comments

comments