Home ఆదిలాబాద్ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి

ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి

sfiకలెక్టరేట్: వసతి గృహాల్లో నెలకోన్న సమస్యలపై వసతి గృహాల విద్యార్థులు కదం తొక్కారు. మంగళవారం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపట్టారు. అనంతరం కలెక్టరేట్ లోపలికి చోచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు వారికి మధ్య తోపులాట జరిగింది. ఎంతకు వినకపోవడంతో పోలీసులు నాయకులను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. సొంతపూచికత్తుపై విడుదల చేశారు. అం తకు ముందు ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్ష, కార్యదర్శులు గొడిసెల కార్తీక్, కిరణ్ మాట్లాడుతూ ఇటివల వసతి గృహాల సమస్యల అద్యాయనం కోసం సైకిల్ యాత్ర నిర్వహించి నివేధికలు అధికారులకు అందించిన ఇప్పటి వరకు స్పందించలేదని అన్నారు. అధికారుల తీరును నిరసిస్తూ ధర్నా నిర్వహించినట్లు తెలిపారు. జిల్లాలో కొన్ని హాస్టళ్లలో మరుగు దొడ్లు, మూత్రశాలలు, స్నానపు గదులు లేక ఉన్న భవనాలు శిథిలవస్థకు చేరుకోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. జిల్లాలో విద్యార్థులకు యూనిఫాం, పుస్తకాలు నోట్స్ బుక్‌లు సగానికి పైగ రాలేదని ఆరోపించారు. కేజిబీవి, బిసి హాస్టళ్లలకు కాస్మోటిక్ చార్జీలు ఇంత వరకు రాలేదని మండిపడ్డారు. అంతే కాకంటే ఎస్‌ఎంహెచ్ హాస్టళ్లకు సొంత భవనాలు లేవని కొన్ని నిర్మాణంలో ఉన్నాయని మరి కొన్ని అద్దె భవనల్లో కనీస సౌకర్యాలు లేక సమస్యలతో విద్యార్థులు సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఇందులో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు జయ శ్రీ, రాకేష్, మోహన్, భీంరావ్, మహేష్, రంజిత్, సమీర్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.