Home తాజా వార్తలు ఎంపి కవితకు దమ్ముంటే జిల్లాకు నీళ్లు తెప్పించు: షబ్బీర్ ఆలీ

ఎంపి కవితకు దమ్ముంటే జిల్లాకు నీళ్లు తెప్పించు: షబ్బీర్ ఆలీ

Untitled-1ఇందూరు: ప్రాణహిత చెవెళ్ల నుండి నీళ్లు వచ్చేందుకు 28ప్యాకేజీలు ఉన్నాయని, జిల్లా ఎంపీ కవితకు దమ్ముంటే 21, 22, 23 ప్యాకేజీల ద్వారా జిల్లాకు నీళ్లు తెప్పించాలని ఆయన సవాల్ విసిరారు. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టిన మొదలుపెట్టిన హరితహారం కార్యక్రమం ఏమైంది, ఆ మొక్కలు ఏమయ్యాయని ఆయన టీఆర్‌ఎస్‌పార్టీని ప్రశ్నించారు. కేసీఆర్ లెగ్గు మహిమో ఏమో కాని వర్షా లు పడక రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తుందన్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమవుతుండడంతో ఆయన అబద్దాలకోరు అన్న విషయం అందరికీ అర్థమవుతుందన్నారు. టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన సం వత్సర కాలంలోనే 1వేయి 16మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుని చనిపో యారని ఇది ఎంతో బాధకరమైన విషయమని, ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, మీ పక్షాన కాంగ్రెస్‌పార్టీ కొండత అండగా నిలబడుతుందని షబ్బీర్ అలీ భరోసా ఇచ్చారు. రైతుల్లో ఆత్మస్థైర్యాన్ని నిం పేందుకు ఈనెల 16 నుండి జిల్లాలో పలుచోట్ల పర్యటించి భారీ సభలను నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రైతులకు లక్షరూపాయల రుణాలను ఇచ్చి మాఫీ చేయాలని, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు 5లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, పాత రుణాలు అడుగకుండా కొత్తరుణాలను ఇవ్వాలని, ప్రభుత్వమే ఎరువులు, విత్తనాలు అందించి రైతులను తక్షణమే ఆదుకోవాలని, కరువు నివారణ చర్యలు చేపట్టాని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
కేసీఆర్, డీఎస్‌లు రాజకీయ రాబందులు: మధుయాష్కిగౌడ్
రాజకీయ రాబందులు, రాజకీయ వ్యభిచారులు ఎలాంటారని ఎవరైనా అడిగితే కేసీఆర్, డిఎస్‌ల ఫోటోలను చూపించాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి మధు యాష్కిగౌడ్ విమర్శించారు. కాంగ్రెస్‌పార్టీ హాయాంలో ప్రాణహిత చెవెళ్ల ప్రాజె క్టుకు జాతీయ హోదా కల్పించేందుకు కృషిచేశామన్నారు. రైతులకు అవసరమైన సాగునీరు అందించామని, కాంగ్రెస్ హాయాంలో నిజామాబాద్ జిల్లా అన్న పూర్ణగా విలసిల్లిందని ఆయన గుర్తుచేశారు. ప్రాణహిత చెవెళ్లపై కాంగ్రెస్ పార్టీత రపున శ్రీకృష్ణ కమిటికి ఎన్నో నివేదికలు ఇవ్వడం జరిగిందన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ హా యాంలో మాచారెడ్డి మండలంలో రైతులు అత్యథికంగా ఆత్మహత్యలు చేసుకుని చనిపోతే వారిని కాంగ్రెస్‌పార్టీ స్వంతఖర్చులతో ఆదుకుందని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం రైతన్నలు ఆధైర్యపడొద్దని, వారికి అన్ని విధాల కాంగ్రెస్‌పార్టీ అండగా ఉంటుందని ఆయన భరోసా మధుయాష్కి భరోసా ఇచ్చారు. రైతులను ఆదుకోకుండా ఫాంహౌస్‌లలో విలసవంతమైన జీవితాలు అనుభవిస్తున్న కేసీఆర్‌కు, టీఆర్‌ఎస్ నాయకులకు రైతుల శాపం తప్పకుండా తగులుతుందన్నా రు. కాంగ్రెస్‌పార్టీ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసింది కాని టీఆర్‌ఎస్‌పార్టీ మాదిరిగా గుట్కా, ఇసుక దందాలు చేయలేదని ఆయన విమర్శించారు. టీఆర్‌ఎస్‌పార్టీ రైతులను విస్మరించడం వల్లే రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయన్నారు.
కాంగ్రెస్ ప్రతిపోరాటం ప్రజాసంక్షేమానికే: మాజీ స్పీకర్ కె.ఆర్.సురేష్‌రెడ్డి
కాంగ్రెస్ పార్టీ ఏ పోరాటం చేసిన అది ప్రజా సంక్షేమానికేనని మాజీ స్పీకర్ కె.ఆర్.సురేష్‌రెడ్డి పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్‌పార్టీలో డిఎస్ ఉన్నప్పుడు జిల్లాకు వచ్చిన సందర్భంలో ఎంతో హంగు ఆర్భాటాలు ఉండేవని, ఆయన వస్తున్నాడంటే మా నాయకుడు వస్తున్నాడని ప్రజలు ఎంతో మురిసిపోయి బ్రహ్మరథం పట్టేవారని, కాని నిన్న డిఎస్ జిల్లాకు వచ్చినప్పుడు ఆ పరిస్థితి కానరాలేదన్నారు. కాంగ్రెస్‌పార్టీ ఆయనకు అంతటి హోదా కల్పించిందని, ప్రస్తుతం టీఆర్‌ఎస్ పార్టీలో ఆయన పరిస్థితి దుర్భరంగా మారిందని, ఆయనను చూస్తుంటే జాలి కలుగుతుందని సురేష్‌రెడ్డి పేర్కొన్నారు. అలాగే టీఆర్‌ఎస్ పార్టీ ప్రాణహిత చెవెళ్ల డిజైన్ మార్పు విషయంలో పూర్తి అవగాహనతో వ్యవ హరించాలని, నిపుణులైన ఇంజనీర్ల సలహాలు తీసుకోవాలన్నారు. అంతే కాని తమకు తోచిన విధంగా డిజైన్ మార్పుచేస్తే ప్రజలకు తీరని అన్యాయం జరుగు తుందన్నారు. కేసీఆర్ ప్రజల శ్రేయస్సు కోరి కాకుండా పూర్తి కక్షపూరితంగా పాలనను కొనసాగిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టుపై ఎలాంటి అలసత్వం జరిగినా కాంగ్రెస్‌పార్టీ ఊరుకోదన్నారు. బంగారు తెలంగాణ కేసీఆర్ కుటుంబానికే పరిమితమైందన్నారు.
15నెలల్లోనే మంది రైతుల ఆత్మహత్యలు: ఎమ్మెల్సీ ఆకుల లలిత
రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌పార్టీ అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాల వల్ల ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన 15నెలల కాలంలోనే 13వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోయారని ఎమ్మెల్సీ ఆకుల లలిత ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి రైతులకు చేసింది ఏమి లేదన్నారు. గతంలో కాంగ్రెస్‌పార్టీ రైతులను అన్నివిధాల ఆదుకుందని ఆమె గుర్తుచేశారు. కాంగ్రెస్‌పార్టీ రైతుల పక్షపాతి అని ఆమె పేర్కొన్నారు. కాంగ్రెస్‌పార్టీ హాయాంలో వర్షాలు కుంభవృష్టిగా కురిసాయని, ఇప్పుడు వర్షాలు లేక కరువుతో రైతులు అల్లాడుతున్నారన్నారు. టీఆర్‌ఎస్‌పార్టీ జిల్లాలోని షుగర్‌ఫ్యాక్టరిని మూసివేయించిందని, వారిని తక్షణమే ఆదుకోవాలన్నారు. గ్రామజ్యోతిలో ఎవ్వరిని భాగస్వామ్యం చేయలేదన్నారు. రాబోవు రోజుల్లో కాంగ్రెస్‌పార్టీ హాయాంలో గ్రామ గ్రామన పాదయాత్ర చేసి రైతులకు భరోసా కల్పించనున్నామని ఆమె తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, మాజీ ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్, పిసిసి అధికార ప్రతినిధి మహేష్‌కుమార్‌గౌడ్, మాజీ పార్లమెంట్ సభ్యులు సురేష్‌షట్కార్, మాజీ ఎమ్మెల్యే గంగారాం, బాన్సువాడ కాన్‌స్ట్రెన్సీ ఇంచార్జీ బాల్‌రాజ్, ఎల్లారెడ్డి కాన్‌స్టెన్సీ ఇంచార్జీ నల్లమడుగు సురేంధర్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ శ్రీనివాస్‌యాదవ్, వక్ఫ్‌బోర్డ్ చైర్మన్ జావిద్ అక్రమ్, కామారెడ్డి మున్సిపల్ చైర్‌పర్సన్ పిప్పెర సుష్మ, నగర కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు కేశవేణు, జిల్లా రైతు కిసాన్ ఖేత్ కాంగ్రెస్ అధ్యక్షులు ముప్పగంగారెడ్డి, కిసాన్ ఖేత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్వేష్‌లు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఇతర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.