Home తాజా వార్తలు ‘లయన్ కింగ్’కు షారుఖ్, ఆర్యన్ డబ్బింగ్

‘లయన్ కింగ్’కు షారుఖ్, ఆర్యన్ డబ్బింగ్

Shah Rukh, Aryan

 

క్రూర మృగాలు మనుషుల వలే మాట్లాడతాయి, మిగతా మృగాలతో స్నేహం చేస్తాయి, కలిసిమెలిసి జీవిస్తాయి. ఏదైనా జంతువు కనిపిస్తే వేటాడి తినేసే రారాజు సింహం తన రాజ్యంలో ఉన్న జంతువులను కాపాడుతూవుంటుంది. ఇది అంతా డిస్నీ వారు రూపొందించిన ‘లయన్ కింగ్’ అనే సినిమా కథ. డిస్నీ కామిక్ పుస్తకాల్లో పుట్టిన ఈ సింహం పేరు సింబ, సింబనే లయన్ కింగ్ కథకి హీరో. అలాగే సింబతో పాటు టిమోన్ అనే ముంగిస, పుంబా అనే అడవి పంది… లయన్ కింగ్ కథలో ముఖ్య పాత్రలు. కార్టూన్ నెట్‌వర్క్‌లో కామిక్ సీరియల్‌గా మొదలైన లయన్ కింగ్‌ని ఆ తరువాత డిస్నీ వారు 2డి యానిమేటెడ్ సినిమాగా 90లో విడుదల చేశారు. అప్పట్లో సూపర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమాను ఇప్పుడు 3డి యానిమేటెడ్ టెక్నాలజీతో, కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉపయోగించి ‘లయన్ కింగ్’ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు.

కొత్త హంగులతో 3డి యానిమేటెడ్ సినిమాగా ‘లయన్ కింగ్’ను జూలై 19న విడుదల చేస్తున్నారు. ఇప్పుడు ఈ విజువల్ వండర్‌కు బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ గాత్ర దానం చేశారు. ఈ చిత్రంలో కీలక పాత్ర అయిన ముసాఫాకు షారుఖ్ డబ్బింగ్ చెప్పారు. ఇక ముసాఫా తనయుడు, సినిమాకు హీరో పాత్ర అయిన సింబాకు షారుఖ్ తనయుడు ఆర్యన్ ఖాన్ డబ్బింగ్ చెప్పడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని ముఖ్య భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. తెలుగులో కూడా ‘లయన్ కింగ్’ భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది.

Shah Rukh, Aryan Dubbing to Lion King