Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

అటల్‌జీపై షారూక్ భావోద్వేగపు పోస్ట్‌…(వీడియో)

Shah Rukh Khan Tribute Atal Bihari Vajpayee

ముంబయి: ప్రజాస్వామ్యమంటే అంకెల గారడీ కాదని, యావత్‌భారత్ ప్రజల ఆశలు, ఆకాంక్షలు, కన్నీళ్లను ప్రతిబింబించేదే పార్లమెంట్ అని చెప్పిన పదహారణాల ప్రజాస్వామ్యవాది ఎదురులేని జననేత కవి జర్నలిస్టు ఉత్తమ పార్లమెంటేరియన్ భారతరత్న భరతమాత ముద్దుబిడ్డ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ తన 93వ ఏట గురువారం సాయంత్రం గం. 5.05లకు న్యూఢిల్లీలోని ఆలిండియా మెడికల్ సర్వీసెస్ సంస్థ (ఎయిమ్స్)లో తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయన మృతిపట్ల వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. తాజాగా బాలీవుడ్ బాద్ షా, ఖాన్ త్రయంలో ఒకరైన కింగ్ ఖాన్ షారూక్ ఖాన్..  అటల్‌జీ మృతిపై ఓ భావోద్వేగపు లేఖను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

‘అవి ఢిల్లీలో ఉన్నప్పటి రోజులు నా నాన్న వాజ్‌పేయీ ప్రసంగాలకు తీసుకెళ్లేవారు. ఆ తర్వాత నేను పెద్దవాడిని అయ్యేకొద్ది వాజ్‌పేయీతో కలిసి సమయం గడిపే అవకాశం వచ్చింది. మేం ఎప్పుడు కలుసుకున్నా కవిత్వాలు, సినిమాలు, రాజకీయాలు, నయమవుతున్న మోకాలి నొప్పుల గురించే మాట్లాడుకునేవాళ్లం. ఆయన రాసిన పద్యాల్లోని ఓ పాటలో నాకు నటించే గౌరవం దక్కింది. మా ఇంట్లో ఆయన్ను అందరూ ‘బాప్‌జీ’ అని పిలుచుకునే వాళ్లం. ఈరోజు దేశం ఓ గొప్ప తండ్రిని, నేతను కోల్పోయింది. ఎప్పుడూ నవ్వుతూ ఉండే మిమ్మల్ని మిస్సవుతాం బాప్‌జీ’ అంటూ షారూఖ్ రాసుకొచ్చారు. అలాగే ఓ భావోద్వేగపు పాట వీడియో లింక్‌ను కూడా ఈ సందర్భంగా షారూఖ్ పోస్ట్‌ చేశారు. ఇది ‘క్యా కోయా క్యా ప‌యా జ‌గ్ మేన్’ అనే ప‌ద్యాన్ని కొన్నేళ్ళ క్రితం అట‌ల్ బిహారీ వాజ్ పేయి రాసారు. ఈ క‌విత‌ను స్వ‌ర్గీయ జ‌గ్జీత్ సింగ్ ఆల‌పించారు. 1999లో షారూఖ్ ఖాన్ మీద ఈ పాటను చిత్రీక‌రించారు. జీవితంలో మ‌నిషి ఎదుర్కొనే ఆటుపోట్ల‌ను వాజ్‌పేయి ఈ క‌విత‌లో చాలా స్పష్టంగా రాశారు. ఈ పద్యాన్ని త‌మ సినిమాలో వాడుకున్నారు య‌శ్ చోప్రా. దీనికి సంబంధించిన వీడియోని షారూఖ్ త‌న ట్విట్టర్‌ ద్వారా షేర్ చేయడంతో పాటు త‌న‌కి అటల్‌జీతో ఉన్న అనుబంధం గుర్తు చేసుకున్నారు.

Comments

comments