Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

ఆ హీరో భార్యకు బాయ్ ఫ్రెండ్స్ ఎక్కువేనట..!!

Shahid-Kapoor

ముంబయి: బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ ‘కాఫీ విత్ కరణ్’ అనే టివి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దీంట్లో సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖుల ప్రేమాయణాల గురించి వారితోనే చర్చిస్తారాయన. దీనిలో భాగంగా తరువాతి ఎపిసోడ్‌లో షాహిద్ కపూర్, మీరా రాజ్‌పుత్ దంపతులు హాజరవుతున్నారు. దీనికి సంబంధించి ట్రయల్ పార్టులో షాహిద్ చెప్పిన సమాధానాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

వివాహానికి ముందు ప్రేమ కథల మాటేంటి అని భార్య మీరా రాజ్‌పుత్ ప్రశ్నించగా… ఆమె నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. కానీ షాహిద్ నుంచి వచ్చింది. దీనికి ఆయన ఇలా బదులిచ్చాడు.. “నా కన్నా తక్కువేం కాదంటూ” నవ్వేశాడు. అంటే పెళ్లికి ముందు షాహిద్ లవర్ బోయ్ ఇమేజ్‌తో ప్లేబాయ్‌ల గడిపిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ సమాధానంపై బాలీవుడ్ జనాలు తెగ చర్చించుకుంటున్నారు. ట్రైలరే ఇంతా ఘాటుగా ఉంటే అసలు ఎపిసోడ్ ఇంకా ఎలా ఉంటుందో అని గుసగుసలాడుకుంటున్నారు.

Comments

comments