Search
Wednesday 14 November 2018
  • :
  • :

బాహుబలి-2లో షారూఖ్‌ఖాన్..!?

Shahrukh-Khan-In-Baahubali-

హైదరాబాద్ : బాహుబలి ది బిగినింగ్ చూసిన ప్రతీ ఒక్కరిని సందిగ్ధంలో ఉంచి ప్రశ్న ‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు’. ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే బాహుబలి ద్వితీయ భాగంలో తెలుస్తుందని దర్శకుడు రాజమౌళి పేర్కొన్న విషయం తెలిసిందే. దీంతో బాహుబలి-2 కోసం సినీ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో బాహుబలి-2కు సంబంధించి మరో వార్త అభిమానులకు సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసింది.

అదే బాహుబలి పక్కన బాలీవుడ్ బాద్‌షా తళుక్కుమననున్నాడట.. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ నలుమూలల విస్తరింపజేసిన సినిమాలో కింగ్ ఖాన్ కనువిందు చేయనున్నారట.. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న విజువల్ వండర్ బాహుబలి ది కన్‌క్లూజన్‌లో షారూఖ్ ఖాన్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారనే వార్త ప్రస్తుతం టీ టౌన్‌లో హల్‌చల్ చేస్తుంది.

బాహుబలి-2 షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటుంది. ఈ ఏడాది ఏప్రిల్ 28న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. అయితే ఇప్పుడు ఈ చిత్రంలో షారుఖ్ ప్రత్యేక పాత్రలో అలరించనున్నారనే వార్త అభిమానులకు మరింత ఆసక్తి కలిగిస్తుంది. అయితే ఈ వార్తలపై అటు బాహుబలి టీం కానీ, షారూఖ్ కానీ ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడించలేదు. ఇప్పటికే ఇటువంటి ఎన్నో వార్తలెన్నో బాహుబలి చిత్రంపై పుట్టుకొచ్చాయి.. వాటన్నింటిని చిత్ర బృందం కొట్టి పారేస్తూ వచ్చింది. మరీ ఈ వార్తపై చిత్ర బృందం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.

Comments

comments