Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

ఘన విజయం దిశగా ‘శంభో శంకర’

Shakalaka-Shankarషకలక శంకర్, కారుణ్య హీరోహీరోయిన్లుగా ఆర్.ఆర్. పిక్చర్స్ సంస్థ, ఎస్.కె. పిక్చర్స్ సంస్థ సమర్పణలో వై.రమణారెడ్డి, సురేష్ కొండేటి సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘శంభో శంకర’. ఇటీవల విడుదలైన ఈ చిత్రం మంచి సక్సెస్‌ను సాధించింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్‌లో సినిమా యూనిట్ గ్రాండ్ సక్సెస్‌మీట్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా సురేష్ కొండేటి మాట్లాడుతూ “10 కోట్ల బడ్జెట్ పెట్టి చేయాల్సిన సినిమాను అతి తక్కువ బడ్జెట్‌లో చేయడానికి పది రూపాయలకు ఒక రూపాయి మాత్రమే తీసుకొని అందరూ బాగా వర్క్ చేశారు. ఇక  డిస్ట్రిబ్యూటర్స్ అందరూ సంతోషంగా ఉన్నారు. ఇది పక్కా కమర్షియల్ బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పగలను. ‘శంభో శంకర’ చిత్రం ద్వారా వచ్చిన డబ్బుల్లో కొంత పదివేల రూపాయల చొప్పున మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ద్వారా పది మంది నిరు పేదలకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నాము”అని అన్నారు. హీరో శంకర్ మాట్లాడుతూ “ఈ సినిమా చూసి ప్రేక్షకులందరూ హ్యాపీగా ఉన్నారు. చాలా మంది నాకు ఫోన్ చేసి అభినందిస్తున్నారు. రమణారెడ్డి, సురేష్ కొండేటి కష్టం వల్లే ఈ సినిమా హిట్ అయింది. ఇకపై కూడా ఇదే విధంగా నిజాయితీగా సినిమాలు చేస్తాను”అని తెలిపారు. చిత్ర దర్శకుడు శ్రీధర్ మాట్లాడుతూ “శంకర్, నేను ఎంతో ఇష్టంగా ఈ సినిమా కోసం కష్టపడ్డాము. ఈ సినిమా హిట్‌తో మేము పడ్డ కష్టానికి ఫలితం లభించినట్లయింది”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ‘మా’ అధ్యక్షుడు శివాజీ రాజా, కారుణ్య, ఏడిద శ్రీరామ్, ప్రభు, నాగినీడు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments