Search
Thursday 15 November 2018
  • :
  • :

గుర్తు తెలియని మృతదేహం లభ్యం

ShamirPet Police Find Out Unknown Person Skeleton

శామీర్‌పేట : గుర్తు తెలియని మృతదేహం లభ్యం అయిన సంఘటన శామీర్‌పేట పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం వెలుగు చూచింది. పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. శామీర్‌పేట మండల కేంద్రం సమీపంలోని అవుటర్ రింగ్ రొడ్డు టోల్‌గేట్ వద్ద నాలాలో మృతదేహం అస్తిపంజరం ఉందని టోల్‌గేట్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు.  పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించగా కుళ్లిపోయిన  మృతదేహం నాలాలో పడి ఉంది. మృతుడి వంటిపై టి షర్ట్, ప్యాంటు ధరించి ఉన్నాడు. అతనికి తెల్లని గడ్డం సైతం ఉందని తెలిపారు. మృతుడి వయసు 45 నుంచి 50 సంవత్సరాలు ఉండ వచ్చని, గత నెల రోజుల క్రితం మృతి చెంది ఉండ వచ్చని చెప్పారు. ఈ మేరకు శామీర్‌పేట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments