Home తాజా వార్తలు డిజిపిని కలిసిన శరత్ తల్లిదండ్రులు

డిజిపిని కలిసిన శరత్ తల్లిదండ్రులు

Sharath-Died-in-Firing-in-A

కెన్సాస్: అమెరికాలో దుండగుల కాల్పుల్లో వరంగల్ విద్యార్థి మృతి చెందిన విషయం తెలిసిందే. కెన్సాస్ నగరంలో రెస్టారెంట్‌లో ఉండగా శరత్‌పై దుండగులు కాల్పులు జరిపారు. కాల్పుల విషయాన్ని శరత్ తల్లిదండ్రులకు స్నేహితులు సమాచారమిచ్చారు. శరత్ మృతిపై తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డిని తల్లిదండ్రులు ఆశ్రయించారు. తన కుమారుడి మృతదేహాన్ని త్వరగా తీసుకరావాలని డిజిపికి విజ్ఞప్తి చేశారు.  మృతుడి తండ్రి రామ్మోహన్ హైదరాబాద్‌లో బిఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగి పని చేస్తున్నారు. వరంగల్‌లో బిటెక్ పూర్తి చేసి మిస్సోరి వర్సిటీలో ఎంఎస్ చేస్తున్నాడు. డిజిపి మహేందర్ రెడ్డి శర్‌త మృతి చెందినట్లు బాబాయి మురళికి పోన్ ద్వారా తెలిపారు. దొంగతనం, హత్యకేసులో నిందితుడి వివరాలు తెలిపిన వారికి 10 వేల అమెరికాన్ డాలర్లు రివార్డు ఇస్తామని కన్సాస్ పోలీసులు ప్రకటించారు.