Home లైఫ్ స్టైల్ ‘మొక్కే’ గణేశుడు

‘మొక్కే’ గణేశుడు

స్వాతంత్య్ర సమర సమయంలో భారతీయులను ఏకం చేసి వారిలో సమర స్ఫూర్తి నింపేందుకు బాలగంగాధర్ తిలక్ గణేశ మండపాలను వేదికచేసుకున్నాడు. ఈ మండపాలునగరాలు, పట్టణాల్లో మాత్రమే ఏర్పాటయ్యాయి. కాలానుగుణంగా అన్నింటిలో మార్పు వచ్చినట్లే గణేశ విగ్రహాలు, మండపాల్లో కూడా మార్పు వచ్చింది. ఈ ఆచారం పట్టణాలు, నగరాల నుంచి దేశంలోని మారుమూల పల్లెలకూ వ్యాపించింది. ఒకప్పుడు దేశ యువతను ఏకం చేసేందుకు ఏర్పాటుచేసిన గణేశ మండపాలు నేడు అనేకంగా ఏర్పడ్డాయి. సమాజంలో ఉన్న అన్ని రకాల చీలికలు గణేశుని మీద కూడా ప్రసరించాయి. ఫలితంగా ఆయన కులాలు, వాడలు, పిల్లా, పెద్దల వారీగా విభజన చెందాడు. విడిపోయిన మండపాలు మనుషులను విడదీశాయి. పోటాపోటీగా మండపాల్లో కొలువవుతున్న గణేశ విగ్రహాల మధ్య స్ఫర్థ ఘర్షణలకు దారితీయడం కూడా అడపాదడపా చూస్తున్నాం. పోటీకి తగ్గట్లుగా విగ్రహాలను తయారుచేయడంలో కళాకారులు కూడా పోటీ పడుతున్నారు. పర్యవసానంగా ఏటికేడు వివిధ రంగులు, సరికొత్త డిజైన్లలో విగ్రహాలు దర్శనమిస్తున్నాయి. ఇలా సంఖ్యాపరంగా పెరిగిన గణేశ విగ్రహాలు కేవలం మనుషులను విడదీయడమే కాకుండా, వాటి తయారీలో వాడే హానికారక రసాయనాల వల్ల పర్యావరణం దెబ్బతింటోంది.

Ganesh-Idols

దేశంలో అన్నివర్గాలకు చెందినవారు వినాయక చవితికి పదిహేను రోజుల ముందు నుంచి ఉత్సాహంగా ఏర్పాట్లలో నిమగ్నమయి, బప్పా మోరియా రాకకై ఎదురుచూస్తారు. ఇంతటి ఉత్సాహభరితమైన పండుగను కొన్ని మార్పులు చేర్పులతో చేసుకుంటే ఎవరికి ఏ రకమైన హాని కలుగదు. ‘షేర్ ఎ సర్వీస్’ అనే స్వచ్ఛంద సంస్థ ఈ ఆలోచనకు కార్యరూపం ఇచ్చి పర్యావరణహితమైన గణేశులను తయారుచేస్తోంది. సంస్థ అనేక సమాజహిత కార్యక్రమాలతో పాటు పది సంవత్సరాలనుంచి మట్టి గణేశ విగ్రహాలను తయారుచేసి అందిస్తోంది. ఇటీవలి కాలంలో ఆలోచనలకు మరింత పదునుపెట్టి మొక్క గణేశుడిని తయారుచేస్తున్నారు. దీంతో పాటు అంతగా ఆదరణకు నోచుకోని కుమ్మరి వృత్తి వారిని చేరదీసి మట్టి వినాయకుల తయారీతో వారినీ ప్రోత్సహిస్తున్నారు. పలు పాఠశాలల్లో కూడా మొక్క గణేశ విగ్రహ తయారీకి సంబంధించిన వర్క్‌షాప్స్ నిర్వహిస్తూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రజల్లో అవగాహన కూడా కల్పించేందుకు స్వచ్ఛందంగా ఈ సంస్థలో పనిచేస్తున్న హైదరాబాదీ విశాల గుమ్ములూరు మన తెలంగాణతో పంచుకున్న మరిన్ని ముచ్చట్లు …
‘షేర్ ఎ సర్వీస్’ లో భాగంగా వినాయక చవితి సమయంలో మట్టి వినాయక విగ్రహాలను తయారుచేసి అందిస్తున్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారుచేసిన విగ్రహాలను చెరువులు, కుంటలు, నదుల్లో నిమజ్జనం చేయడం వల్ల అవి కలుషితమై, జీవ, జంతుజాలానికి హానికారకంగా మారుతున్నాయి. పర్యవసానంగా బయోడైవర్సిటీ దెబ్బతిని పర్యావరణానికే ముప్పు ఏర్పడుతోంది. అలాగని సంవత్సరానికోసారి వచ్చే పండుగను జరుపుకోకుండా ఉండమని ఎవరూ చెప్పలేరు. దీనికి విరుగుడే పర్యావరణహితమైన మట్టి గణేశ విగ్రహాలు. చిన్న విగ్రహాలతో మొదలైన వీరి ప్రయాణం భారీ విగ్రహాల వరకు వెళ్లింది.
కుమ్మరులకు ఆసరాగా – నగరంలో, నగరశివారుల్లో నివసిస్తున్న దాదాపు 100 మంది కుమ్మరుల లిస్టు సేకరించి, వారికి వినాయక విగ్రహాల ఆర్డర్లను ఇస్తారు. మట్టితో వినాయకులను చేసే విధానాన్ని కలకత్తా కళాకారులను చూసి ఈ విధంగా మనదగ్గరి కుమ్మరులతో చేయించాలని సంకల్పించారు ఈ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నుంచే సాంచా(మౌల్డ్) చేసుకొని విగ్రహాలను తయారుచేయడం మొదలుపెడతారు. ఈ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు అదే సమయం నుంచి వారికి సూచనలు ఇస్తూంటారు. వివిధ కాలనీలు, హౌసింగ్ సొసైటీల వద్దకు వెళ్లి మట్టి గణేశుల వాడకంపై అవగాహన కల్పిస్తారు. అయితే చిన్నసైజు విగ్రహాలు కేవలం ఇండ్లలోనే ఏర్పాటుచేసి, పరిసరాల్లోనే నిమజ్జనం చేస్తారు. పెద్ద సైజు విగ్రహాలను చెరువుల్లో, నదుల్లో నిమజ్జనం చేస్తారు. పర్యావరణానికి ముప్పు కూడా వీటితోనే ఉంటుందని గత కొన్నేళ్లుగా మండపాలు ఏర్పాటుచేసే వారిదగ్గరికి వెళ్లి మట్టి విగ్రహాలపై అవగాహన కల్పిస్తున్నారు. వారి కోరుకున్న సైజు, డిజైన్లలో విగ్రహాలను తయారుచేయించి అందిస్తున్నారు. ఈ క్రమంలో మట్టితో చేసిన పెద్ద విగ్రహాలకు బీటలు వారితే పూర్తి బాధ్యత స్వచ్ఛంద సంస్థవారే తీసుకుని మరో విగ్రహాన్ని అందించే గ్యారంటీ కల్పిస్తున్నారు. ఇలా కుమ్మరులకు, మండపాల నిర్వాహకులకు మధ్యన వారధిగా నిలుస్తూ మట్టి గణేశ ప్రతిమలను మండపాల్లో పెట్టేవిధంగా ప్రయత్నిస్తున్నారు. వినాయక విగ్రహం వెనక ఒక పేపర్ గ్లాస్‌ను అమర్చి