Home తాజా వార్తలు 10న షేర్ పాటల వేడుక

10న షేర్ పాటల వేడుక

kalyan-ramనందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా సాయి నిహారిక, శరత్‌చంద్ సమర్పణలో విజయలక్ష్మీ పిక్చర్స్ పతాకంపై మల్లిఖార్జున్ దర్శకత్వంలో కొమర వెంకటేష్ నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘షేర్’. ఈ చిత్రం ఆడియోను ఈనెల 10న విడుదల చేయను న్నారు. అలాగే చిత్రాన్ని ఈనెల 30న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చెయ్యడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత కొమర వెంకటేష్ మాట్లాడుతూ “ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెల 30న ప్రపంచవ్యాప్తంగా చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఈ చిత్రం ఆడియోను ఈనెల 10న హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో చాలా గ్రాండ్‌గా రిలీజ్ చెయ్యబోతున్నాం. ఈ ఆడియో ఫంక్షన్‌కు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఆడియోను ఆవిష్కరించనున్నారు. మా చిత్రానికి తమన్ చాలా ఎక్స్‌ట్రార్డినరీ మ్యూజిక్ ఇచ్చారు. డైరెక్టర్ మల్లిఖార్జున్ టేకింగ్ చాలా అద్భుతంగా ఉంది. సినిమాలో కల్యాణ్‌రామ్ కొత్త డైమెన్షన్‌లో కనిపిస్తారు”అని అన్నారు. దర్శకుడు మల్లిఖార్జున్ మాట్లాడుతూ “ఈ సినిమాలో కల్యాణ్‌రామ్ పర్‌ఫార్మెన్స్ చాలా ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటుంది. తమన్ సూపర్‌హిట్ సాంగ్స్ చేశారు. ఆడియో కూడా పెద్ద హిట్ అవుతుంది”అని అన్నారు. నందమూరి కల్యాణ్‌రామ్, సోనాల్ చౌహాన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, రావు రమేష్, రోహిణి, షాయాజీషిండే, ఆలీ, ఎం.ఎస్.నారాయణ, ముఖేష్ రుషి, ఆశిష్ విద్యార్థి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, మాటలుః డైమండ్ రత్నబాబు, సినిమాటోగ్రఫీః సర్వేష్ మురారి, ఎడిటింగ్‌ః కోటగిరి వెంకటేశ్వరరావు, ఫైట్స్‌ః రామ్‌లక్ష్మణ్, ఆర్ట్‌ః సత్యశ్రీనివాస్.