Home అంతర్జాతీయ వార్తలు లాడెన్ నుంచి డబ్బు తీసుకున్న షరీఫ్

లాడెన్ నుంచి డబ్బు తీసుకున్న షరీఫ్

Nawaz-Sharifఇస్లామాబాద్ : ఎన్నికల్లో పోటీ చేసేందుకు అల్‌ఖైదా చీఫ్ ఒసమా బిన్ లాడెన్ దగ్గర నుంచి పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ డబ్బు పుచ్చుకున్నట్లు ఇటీవల విడుదలైన ఓ పుస్తకంలో వెల్లడైంది. 1990 ఎన్నికల్లో బెనజీర్ భుట్టో నేతృత్వంలోని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీని ఓడించడానికి షరీఫ్ డబ్బు పుచ్చుకున్నట్లు, ఖాలీద్ ఖ్వాజా , షహీద్-ఇ-అనుమ్ అనే పుస్తకంలో షమామాఖలీద్ పేర్కొన్నారు. ఆమె పాక్ ఐఎస్‌ఐ మాజీ అధికారి ఖలీద్ ఖ్యాజా భార్య. తాను అధికారంలోకి వస్తే పాక్‌లో ఇస్లామిక్ వ్యవస్థను ఏర్పాటు చేస్తానని షరీఫ్ మాటలకు ఖలీద్ ఖ్వాజా, లాడెన్ ఆకర్షితులయ్యారని, అనంతరం లాడెన్ ఆయనకు పెద్ద మొత్తంలో డబ్బు అందజేశారని షమామా రాశారు. అయితే అధికారంలోకి వచ్చిన షరీఫ్ తన వాగ్దానాలను మరిచారని ఆమె పేర్కొన్నారు. షరీఫ్‌కు చాలా కాలం పాటు ఖ్వాజా నమ్మినబంటులా ఉండే వారని పాక్ ఐఎస్‌ఐ మాజీ డైరెక్టర్ జనరల్ హమీద్ జనరల్ హమీద్‌గుల్ వెల్లడించారు.