Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

శర్వానంద్ ‘మహానుభావుడు’

sharvanand

శర్వానంద్, మెహరిన్ హీరోహీరోయిన్లుగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రానికి ‘మహానుభావుడు’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. యువి క్రియేషన్స్ బ్యానర్‌లో వంశీ, ప్రమోద్‌లు సంయుక్తంగా  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు మొదలయ్యాయి. ఇటలీ, ఆస్ట్రియా, క్రోయేషియా వంటి విదేశాల్లో పొలాచ్చి, రామోజీ ఫిలింసిటీ, హైదరాబాద్‌లోని అందమైన లొకేషన్స్‌లో సినిమా షూటింగ్ జరుపుకుంది. పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ “రన్ రాజా రన్, ఎక్స్‌ప్రెస్ రాజా వంటి మంచి హిట్‌ల తర్వాత శర్వానంద్ హీరోగా చేస్తున్న చిత్రం ‘మహానుభావుడు’. మారుతి చెప్పిన క్యారెక్టరైజేషన్, కామెడీ చాలా బాగా నచ్చి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తయింది. డబ్బింగ్ కార్యక్రమాలు మొదలయ్యాయి. ఈనెల 24న సినిమా ఫస్ట్‌లుక్, ఫస్ట్‌లుక్ టీజర్‌ను విడుదల చేస్తాం. అన్ని కార్యక్రమాలను పూర్తిచేసి విజయదశమికి సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం”అని అన్నారు. దర్శకుడు మారుతి మాట్లాడుతూ “భలే భలే మగాడివోయ్ చిత్రం తర్వాత నాకు బాగా నచ్చిన క్యారెక్టరైజేషన్‌తో చేస్తున్న చిత్రం ‘మహానుభావుడు’. శర్వానంద్ కెరీర్‌లో ఈ చిత్రం బెస్ట్ మూవీగా నిలుస్తుందన్న నమ్మకం ఉంది. సినిమాలో ఫుల్ కామెడీ ఉంటుంది. తమన్ సూపర్ ఆడియోను అందించాడు. మ్యూజికల్ లవ్ స్టోరీగా ఈ చిత్రం ఉంటుంది”అని తెలిపారు. వెన్నెల కిషోర్, నాజర్, భద్రం, కళ్యాణి నటరాజ్, భాను, హిమజ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌ః నిజార్ షఫి, ఎడిటింగ్‌ః కోటగిరి వెంకటేశ్వరరావు, ఫైట్స్‌ః వెంకట్.

Comments

comments